బిగ్ బి అమితాబచ్చన్ గురించి ఈ విషయాలు తెలుసా..?
అమితాబచ్చన్ పుట్టినరోజు సందర్భంగా చాలామంది సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అమితాబచ్చన్ ఇండస్ట్రీలో సాధించిన విజయాల గురించి ఇప్పుడు చూద్దాం.. అమితాబచ్చన్ సౌత్ హిందుస్తానీ సినిమా నుంచి మంచి విజయాన్ని అందుకున్న హీరోగా పేరు సంపాదించడమే కాకుండా జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. అమితాబచ్చన్ తన ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత ఏకంగా అరడజన్ సినిమాలు ఫ్లాప్లుగా మిగిలాయి. అమితాబచ్చన్ కెరియర్ అయిపోయింది అనుకుంటున్నా సమయంలో హిట్టు కొట్టి మరి నిలదొక్కుకున్నారు.
జంజీర్ సినిమాతో మరొకసారి యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు సంపాదించారు. అలా ఎన్నో యాక్షన్ సినిమాలలో నటించిన అమితాబ్ షోలే సినిమాతో నెంబర్ వన్ స్థానానికి చేరిపోయారు. బాలీవుడ్ హీరోలలో డ్యూయల్ రోల్స్ హీరోల లిస్టుల ఎక్కువగా అమితాబచ్చనే ఉంటారట. అలా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా విజయ్ అనే సినిమాలోని పాత్ర పేరుతో 20 చిత్రాల్లో నటించారు. ఈ పేరుతో బాగా కలిసి రావడంతో దర్శక నిర్మాతలు కూడా ఆ పేరుని సజెషన్ చేసేవారట. 30కి పైగా పాటలు పాడిన అమితాబచ్చన్ ఇప్పటివరకు 200 సినిమాలను వివిధ భాషలలో నటించారు. బాలీవుడ్ స్టార్లలో అత్యధికంగా బాషాలలో నటించిన హీరోగా పేరు సంపాదించారు అమితాబ్. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, పద్మ విభూషణ్, పద్మశ్రీ ,దాదా పాల్కే అవార్డులు కూడా అందుకున్నారు. నిర్మాతగా కూడా జాతీయ అవార్డును కూడా అందుకున్నారట.