ఆ ఏరియాలో దేవర కి చేదు అనుభవం.. ఏకంగా అంత నష్టం..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా దేవర పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో బాలీవుడ్ నటి జాన్వి కపూర్ , ఎన్టీఆర్ కు జోడిగా నటించగా ... హిందీ సినీ పరిశ్రమలో నటుడుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించగా ... శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని భారీ ఎత్తున లాభాలను కూడా అందుకుంటుంది. కానీ ఒక ఏరియాలో మాత్రం ఈ సినిమాకు నష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ ఏరియా ఏది ..? అక్కడ దేవర కు ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం. ఎక్కువ శాతం తమిళనాడు ఏరియాలో పరభాష సినిమాలు కలెక్షన్లను ఎక్కువగా రాబట్టవు. ఇక దేవర పార్ట్ 1 సినిమా పరిస్థితి కూడా తమిళనాడు ఏరియాలో అలాగే మారింది. తమిళనాడు ఏరియాకు గాను ఈ సినిమాకు ఆరు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు తమిళనాడు ఏరియాలో కేవలం 4.07 కోట్ల షేర్ కలక్షన్లు మాత్రమే వచ్చాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా విడుదల అయ్యి చాలా రోజులు అవుతుంది. దానితో ఈ మూవీ కి ఈ ఏరియాలో పెద్ద మొత్తంలో కలక్షన్లు ఇకపై వచ్చే అవకాశం చాలా తక్కువ శాతం ఉంది. దానితో కనీసంలో కనీసం తమిళనాడు ఏరియాలో ఈ మూవీ కి ఒక కోటి వరకు నష్టం వచ్చే అవకాశాలు ఉన్నట్లు కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా తమిళనాడు ఏరియాలో ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి ఏ  రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: