అవకాశాల కోసం దిగజారిన హీరోయిన్.. మేకోవర్ చూస్తే షాక్..!

Divya
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ రేబా మౌనిక జాన్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. హీరో శ్రీ విష్ణు నటించిన సామజగరగమన అనే చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఈమె తమిళ్ ,మలయాళం వంటి చిత్రాలలో కూడా నటించడానికి సిద్ధమయ్యింది. అలా జకబింటే స్వర్గరాజ్యం అనే మలయాళం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రేబా మౌనిక జాన్.. ఫోరేన్సిక్, బిగిల్, మైఖేల్, ఎఫ్ఐఆర్ అంటే చిత్రాలలో కూడా నటించింది.

తన కెరియర్ లో క్యూట్ గా పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ తన అందాలతో సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. అయితే గతంలో రేబా మౌనిక జాన్ ఫోటో చూసినవారు ప్రస్తుతం ఉన్న ఫోటోలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ముద్దుగుమ్మ మేకోవర్ కి అందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా ఫిదా అవుతున్నారు. గత ఫోటోలలో చూస్తే రేబా మౌనిక చాలా బక్క చిక్కిపోయి కాస్త నల్లగా కనిపిస్తూ ఉన్నది.

ప్రస్తుతం ఉన్న ఫోటోలలో మాత్రం రేబా మౌనిక జాన్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ కాస్త బొద్దుగా కనిపిస్తూ మరింత  అందంగా ఆకట్టుకుంటోంది. గతంలో ఉన్న గ్లోకి ఇప్పుడు ఉన్న గ్లోకి తన ఫేసులో చాలా క్లియర్ గా కనిపిస్తోంది అంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో చాలా పద్ధతిగా కనిపించిన రెబా జాన్ ఇప్పుడు అందాలతో కుర్రాలకు కునుకు లేకుండా చేసేలా కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గత ఏడాది రజని అనే ఒక మలయాళ సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం సకలకళవల్లభ అనే కన్నడ సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. రేబా మౌనిక తమిళ్, మలయాళం, కన్నడ ,తెలుగు వంటి చిత్రాలలో కూడా నటించింది. అలాగే పలు టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: