బలగం వేణు 'ఎల్లమ్మ'.. ఎప్పటి నుంచి స్టార్ట్ తెలుసా?

praveen
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి కమర్షియల్ హంగులతో రూపుదిద్దుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలకంటే విభిన్నమైన కథాంశంతో నాచురాలిటీకి దగ్గరగా ఉన్న సినిమాలకే ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. అలాంటి సినిమాలోని ప్రేక్షకులు కూడా పెద్ద హిట్ చేసేస్తూ ఉన్నారు. సినిమాలో స్టార్ హీరోలు లేకపోయినా.. భారీ తారాగణం కనిపించకపోయినా.. ఇక ఇలాంటి చిన్న సినిమాలే బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం.

 ఇలా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సెన్సేషన్ సృష్టించిన సినిమాలలో బలగం మూవీ కూడా ఒకటి. మనుషుల మధ్య కనుమరుగు అవుతున్న ప్రేమాభిమానాలను మరోసారి గుర్తు చేసింది ఈ మూవీ. ఇక బంధాలు బంధుత్వాలకు ఎంత విలువ ఉంటుంది అన్న విషయాన్ని మరోసారి అందరికీ అర్థమయ్యేలా చేసింది. అంతెందుకు ఎన్నో ఏళ్లుగా పంతాలు  పట్టింపులతో మాట్లాడకుండా ఉన్న అన్నదమ్ములను అక్కాచెల్లెలను కూడా కలిపింది ఈ సినిమా. ఇక కేవలం థియేటర్లలో ప్రసారం కావడం కాదు ఊరూర ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి మరి అందరిని ఒకచోట కూర్చోబెట్టి సినిమా ప్రదర్శన చేసేంతలా సెన్సేషన్ హిట్ సాధించింది.

 ఇక ఈ మూవీతో కేవలం కమెడియన్ గా మాత్రమే అందరికీ తెలిసిన వేణు బలగం వేణు గా మారిపోయి.. తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్నాడు. అయితే ఇక ఇప్పుడు ఈ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఏంటి అనే విషయంపై గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఎల్లమ్మ అనే టైటిల్ తో బలగం వేణు, దిల్ రాజు కాంబినేషన్లో మరో మూవీ రాబోతుంది అని ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. కాగా ఇటీవల జనక అయితే గనుక సినిమా ఈవెంట్లో పాల్గొన్న వేణు ఎల్లమ్మ సినిమా ఎప్పుడు ప్రారంభం అంటూ నిర్మాత దిల్ రాజు అడుగుతాడు. అంతా మీ చేతుల్లో పెట్టుకుని నన్ను అడుగుతారు ఏంటి సార్ అని వేణు అంటాడు. వచ్చే నెల నుంచి స్టార్ట్ చేద్దామా అంటూ వేణు అడగగా.. కాదు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేద్దామని దిల్ రాజు చెప్పాడు. దీంతో ఇలా ఎల్లమ్మ మూవీ ఫిబ్రవరి నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనే విషయంపై క్లారిటీ వచ్చింది.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: