నాగచైతన్యను ఇకపై సమంత అలానే పిలవాలా..? ఇదేం కొత్త ట్వీస్ట్ రా స్వామి..!

Thota Jaya Madhuri
నాగచైతన్య ..టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి బాగా బాగా కష్టపడుతున్న హీరో . నాగచైతన్య ఒక తోపైన హీరో అని చెప్పలేం ..అలా అని ఒక ఫ్లాప్ హీరో అని కూడా చెప్పలేం .తాత పెద్ద స్టార్ హీరో.. తండ్రి తెలుగు చరిత్రను తిరగరాసిన హీరో ..ఇద్దరు బడా స్టార్ హీరోల బ్యాక్ గ్రౌండ్ అండ చూసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ హీరో .. ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరోగా మారలేకపోయాడు.
నాగచైతన్య పలు సినిమాల్లో నటించాడు ..హిట్స్ అందుకున్నాడు . కానీ బడా స్టార్ అన్న ట్యాగ్ మాత్రం దక్కించుకోలేకపోయాడు . సినిమాలపరంగా కన్నా కూడా వ్యక్తిగత కారణాల చేతనే సోషల్ మీడియాలో ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటాడు నాగచైతన్య. హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేసి రీసెంట్ గానే మరొక హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్ధం చేసుకున్నాడు .
అప్పటినుంచి సోషల్ మీడియాలో నాగచైతన్య పేరు మారుమ్రోగిపోతుంది . కాగా శోభిత ధూళిపాళ్ల సిస్టర్ సమంత రీసెంట్ గానే పెళ్లి చేసుకుంది.  ఆమె వెడ్డింగ్ ఫొటోస్ కూడా బాగా ట్రెండ్ అయ్యాయి . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో శోభిత ధూళిపాళ్ల ఏ ఇంటర్వ్యూలో మాట్లాడిన తన సిస్టర్ సమంత పేరుని హైలెట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చింది . అయితే నిన్న మొన్నటి వరకు నాగచైతన్య అంటే ఓ హీరోగాని అనుకున్న శోభిత సిస్టర్ సమంత.. పెళ్లి తర్వాత నాగచైతన్యను బావ అనే కొత్త పిలుపుతో పిలవాలా..? అంటూ జనాలు ఆశ్చర్యకరంగా మాట్లాడుకుంటున్నారు.  అంతేకాదు నాగచైతన్య లైఫ్ లో సమంత అన్న పేరుకు స్పెషల్ స్థానం ఉంది . ఇప్పుడు శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్న తర్వాత నాగచైతన్య ఎప్పుడు కూడా సమంత  పేరుని వింటే ఆయనకు తన పాత జ్ఞాపకాలే గుర్తుకు వస్తాయి.  ఇలాంటి ప్రాబ్లం నుంచి నాగచైతన్య ఎలా బయటపడతాడో చూడాలి..!?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: