మనిషి బాడీ కోసం వెతికితే కోతి శవం.. కన్నార్పకుండా చేసే ట్విస్టులు.. ఈ మూవీ చూసారా?
ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, కిష్కింధా కాండమ్ సినిమాలో అపర్ణ (అపర్ణ బాలమురళి) అనే అమ్మాయి ఆజయన్ (ఆసిఫ్ అలీ) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఆజయన్ తండ్రి అయిన అప్పు పిళ్లాయ్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. సర్వీస్ తర్వాత ఇంట్లోనే ఉంటాడు. ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అని ఇంటి నుంచి బయటకు రావడం తక్కువ చేస్తాడు. మర్చిపోవడం అలవాటు కావడంతో రోజూ ఒక పుస్తకంలో నోట్స్ రాసుకుంటాడు.
ఆజయన్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తాడు. అతనికి ముందు పెళ్లి అయింది కానీ, మొదటి భార్య క్యాన్సర్‌తో చనిపోయింది. వారి కొడుకు కూడా పోయిపోయాడు. ఈ బాధలను తట్టుకుని ఆజయన్ అపర్ణను కలుస్తాడు, ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లయిన తర్వాత కూడా వారు తమ కొడుకు కోసం వెతకడం మానరు.
అదే సమయంలో ఆజయన్ తండ్రి తుపాకీ పోతుంది. ఈ తుపాకీ ఎలా పోయింది, దాని వల్ల ఎన్ని ప్రాణాలు పోయాయి, అప్పు పిళ్లాయ్ గతంలో ఏం చేశాడో ఈ సినిమాలో చూపిస్తారు. అలాగే ఆజయన్ కొడుకు ఏమయ్యాడో కూడా ఈ సినిమాలో ప్రశ్నలు లేవనెత్తుతారు. పోలీసులు ఆ కొడుకు శవాన్ని వెతుకుతుంటే ఒక కోతి శవం దొరుకుతుంది. చాచు శవాన్ని ఎవరు నాశనం చేశారు, అపర్ణ అంటే ఆజయన్ రెండో భార్యకు ఏమి తెలుసు అనేది ఈ సినిమాలో ఉత్కంఠగా చూపిస్తారు.
కిష్కింధా కాండమ్ సినిమా ఒక రకమైన మిస్టరీ మూవీ. ఈ సినిమాలో ఎప్పుడూ ఏం జరుగుతుందో అని కన్నార్పకుండా చేసే ట్విస్ట్‌లు ఉంటాయి. అందుకే ప్రేక్షకులు సినిమా అంతా ఆసక్తిగా చూస్తారు. ఈ సినిమాలో నటించిన అపర్ణ బాలమురళి, ఆసిఫ్ అలీల నటనను సినిమా విమర్శకులు బాగా మెచ్చుకున్నారు. ఈ సినిమాను ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌లో చూడొచ్చు. ఇది తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది. మిస్టరీ సినిమాలు ఇష్టపడే వాళ్లకి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. థియేటర్లకు వెళ్లి చూడలేకపోయిన వాళ్లు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమా ఆస్వాదించొచ్చు.