దేవర : ఇది కథ కలెక్షన్లను రాబట్టడం అంటే.. 12 రోజులైనా పస తగ్గలేదు..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర మొదటి భాగం సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే 12 రోజులు అయిన కూడా ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్నాయి. 12 వ రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్లు లభించాయి. మరి 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో దేవర మొదటి భాగం ఏ స్థానంలో ఉంది అనే వివరాలను తెలుసుకుందాం.
విడుదల అయిన 12 వ రోజు బాహుబలి 2 సినిమా 5.49 కోట్ల షేర్ కలక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసి విడుదల అయిన 12 వ రోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆర్ ఆర్ ఆర్ 4.88 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో నిలవగా , సైరా నరసింహా రెడ్డి మూవీ 2.98 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానం లోనూ , ఖైదీ 150 సినిమా 2.95 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలోనూ , గీత గోవిందం సినిమా 2.90 కోట్ల కలెక్షన్లతో 5వ స్థానం లోనూ , బాహుబలి మొదటి భాగం 2.76 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలోనూ , హనుమాన్ సినిమా 2.48 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానంలోనూ , జై లవకుశ సినిమా 2.40 కోట్ల కలెక్షన్లతో ఎనిమిదవ స్థానంలోనూ , సోగ్గాడే చిన్నినాయన సినిమా 2.21 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానంలో నిలిచాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మొదట భాగం సినిమా విడుదల అయిన 12 వ రోజు 2.16 కోట్ల షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాలలో వసూలు చేసి విడుదల అయిన 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో పదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: