నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి ఇప్పటికి కూడా తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే బాలయ్య తన కెరీర్లో ఇప్పటి వరకు అనేక సినిమాలను రిజెక్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా బాలయ్య ఒక బ్లాక్ బాస్టర్ మూవీ ని రిజెక్ట్ చేసి ఒక డిజాస్టర్ మూవీ ని ఎంచుకున్నాడు. మరి బాలయ్య రిజెక్ట్ చేసిన సినిమా ఏది ..? ఎంచుకున్న సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం.
నందమూరి నట సింహం బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం బి గోపాల్ దర్శకత్వంలో పల్నాటి బ్రహ్మనాయుడు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కంటే ముందు బాలయ్య , బి గోపాల్ కాంబోలో రూపొందిన లారీ డ్రైవర్ , రౌడీ ఇన్స్పెక్టర్ , సమరసింహా రెడ్డి , నరసింహ నాయుడు నాలుగు సినిమాలు అద్భుతమైన విజయాలు అందుకోవడంతో వీరి కాంబోలో రూపొందిన ఐదవ సినిమా అయినటువంటి పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది. అసలైతే బాలయ్య ఈ సినిమా స్థానంలో సింహాద్రి మూవీ చేయాల్సింది. ఈ సినిమా కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ బాలయ్య కు వినిపించగా ఇది వరకు తాను చేసిన ఫ్యాక్షన్ సినిమాల కథ మాదిరి గానే ఇది కూడా ఉంది అని సింహాద్రి మూవీ కథను రిజెక్ట్ చేసి బి గోపాల్ దర్శకత్వంలో పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. అలా బాలయ్య రిజెక్ట్ చేసిన సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోగా , ఓకే చేసిన సినిమా డిజాస్టర్ అయినట్లు తెలుస్తోంది.