విశ్వం : ఏకంగా అన్ని కట్స్.. అయినా అంతా రన్ టైమ్.. శ్రీను వైట్ల పెద్ద ప్లాన్ వేసినట్టున్నాడే..?

Pulgam Srinivas
మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా విశ్వం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కావ్య దాపర్ ఈ మూవీ లో గోపీచంద్ కి జోడిగా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టి జి విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చాలా ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు.

వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. అలాగే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు వరుస పెట్టి ఇంటర్వ్యూలలో , టీవీ షో లలో పాల్గొంటూ ఈ సినిమాలో జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ యూనిట్ కి సెన్సార్ బోర్డు ఏకంగా 15 వరకు కట్లు విధించినట్లు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉండటం తోనే ఏకంగా 15 సీన్స్ కట్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా నుండి 15 సన్నివేశాల వరకు కట్ చేసిన కూడా ఈ మూవీ 2 గంటల 36 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాల వల్ల ఈ మూవీపై మంచి అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. దానితో సినిమా మంచి విజయం సాధిస్తుంది అని చాలా మంది జనాలు భావిస్తున్నారు. మరి ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: