మెగా అభిమానులకి ఊహించిన షాక్..లావణ్య త్రిపాఠి కరెక్ట్ గా టైం చూసి కొట్టిందిగా..!?

Thota Jaya Madhuri
అయ్యయ్యో ..ఏంటిది సడన్గా లావణ్య త్రిపాఠి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ మెగా అభిమానులు షాక్ అయిపోతున్నారు. మరికొందరు ఆశ్చర్యపోతున్నారు . మనకు తెలిసిందే ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్గా రాజ్యమేలేసిన అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి ..మెగా ఇంటికి కోడలుగా ప్రజెంట్ చక్రం తిప్పేస్తుంది . మెగా బ్రదర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి ఆ తర్వాత తనదైన స్టైల్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఒకపక్క కుటుంబ బాధ్యతలను.. మరొక పక్క తన  కెరియర్ను హ్యాపీగా ముందుకు తీసుకెళ్తూ వచ్చింది.
అయితే ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో కన్నా మెగా కోడలుగా అడుగుపెట్టిన మరోక్షణం నుంచి ఆమెకు ఆఫర్లు ఎక్కువగా రావడం మొదలుపెట్టాయి . మెగా ట్యాగ్ ఉంటే ఏ డైరెక్టర్స్ అయినా సరే మెగా కాంపౌండ్ చుట్టూ తిరగాల్సిందే . అయితే నిన్న మొన్నటి వరకు కూడా సినిమా విషయాలలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపని లావణ్య త్రిపాఠి సడన్గా ఆ విషయంలో యూటర్న్ తీసుకున్నట్లు నెట్టింట ఓ వార్త వైరల్ గా మారింది .
లావణ్య త్రిపాఠి ఇప్పుడు పలువురు డైరెక్టర్స్ కు కాల్ బ్యాక్ చేసి స్క్రిప్ట్ ను ఓకే చేస్తుందట . గతంలో ఆమె వద్దకు వచ్చి  ఆఫర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ కు లావణ్య త్రిపాఠి కాల్ షీట్స్ ఇవ్వడానికి రెడీగా ఉందట .తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండడానికి లావణ్య త్రిపాఠి ఇలా సినిమాలను మళ్లీ ఓకే చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు లావణ్య త్రిపాఠి రేపో మాపో గుడ్ న్యూస్ చెప్పబోతుంది అంటూ ఫ్యాన్స్ చాలా చాలా ఆశలు పెట్టుకున్నారు . అయితే గుడ్ న్యూస్ చెప్పబోతుందే కానీ అది వాళ్లనుకున్న గుడ్ న్యూస్ కాదు ..సినిమాలపరంగా గుడ్ న్యూస్. దీంతో కొంతమంది లావణ్య త్రిపాఠి ఫాన్స్ హ్యాపీగానే ఉన్న మరి కొంతమంది మెగా ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నావు వదినా అంటూ నిరుత్సాహంగా డీలా పడిపోతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: