3.50 కోట్లతో తీసిన సింహాసనం ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా.. అప్పట్లో పెద్ద రికార్డు..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో కృష్ణ ఒకరు. ఇకపోతే ఈయన ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో సింహాసనం మూవీ ఒకటి. ఈ సినిమా చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వివరాలను తెలుసుకుందాం.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను కేవలం 53 రోజుల్లోనే పూర్తి చేశారు. ఈ మూవీ ని మొదలు పెట్టే సమయంలో ఈ సినిమాను కేవలం 50 లక్షలు బడ్జెట్ లోనే పూర్తి చేయాలి అని మూవీ మేకర్స్ భావించారు. కానీ ఈ సినిమా బడ్జెట్ మాత్రం మేకర్స్ అనుకున్న దాని కంటే చాలా రెట్లు పెరిగిపోయింది. ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి అయ్యే సరికి 3.50 కోట్ల బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని తెలుగు తో పాటు హిందీ లో కూడా చిత్రీకరించారు. కాకపోతే అందులో జితేంద్ర హీరోగా నటించారు. ఇకపోతే ఈ మూవీ 1986 మార్చి 21 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.

తెలుగు తో పాటు హిందీ లో ఈ మూవీ రిలీజ్ అయ్యి సంచలనాలను సృష్టించింది. ఈ మూవీ మొదటి వారంలో 1.51 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించగా , సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 15 లక్షల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. విశాఖపట్నం లో ఈ మూవీ 100 రోజులు ఆడింది. మూడు సెంటర్లలో ఈ మూవీ 10 లక్షలకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 7 కోట్ల వసూళ్లను సాధించి అప్పట్లో అదిరిపోయే రేంజ్ రికార్డును సొంతం చేసుకుంది. ఇలా ఈ మూవీ తో సూపర్ స్టార్ కృష్ణ కు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయం దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: