అర్ధరాత్రి స్టార్ హీరో గది తలుపులు కొడుతూ ?.. బాలీవుడ్ బ్యూటీ మల్లికా హాట్ కామెంట్స్..!

Amruth kumar
బాలీవుడ్లో ఒకప్పుడు తన ఐటెం సాంగ్స్ తో ఎంతో ఫేమస్ అయిన హీరోయిన్లలో మల్లికా షెరావత్ కూడా ఒకరు. అప్పట్లో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాల్లో అసలు కనిపించడం లేదు. చాలా కాలంగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటూ వస్తుంది. ప్రస్తుతం మరోసారి వెండితెరపై అడుగు పెడుతుంది  ‘విక్కీ విద్యా క వో వాలా వీడియో’ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే తన కెరీర్ మొదట్లో తనకు ఎదురైనా చేదు అనుభవాలను  బయట పెట్టింది. ఇండస్ట్రీలో తనకు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో గడ్డు సమస్యలు వచ్చాయని కూడా చెప్పుకొచ్చింది. అలాగే చిత్ర పరిశ్రమలో ఎదుర్కొన్న వేధింపులు గురించి కూడా బహిరంగంగా చెప్పింది.

అలాగే షూటింగ్ కోసం మల్లికా ఇతర దేశాలకు వెళ్ళేది.. అయితే ఓ సినిమా షూటింగ్ కోసం సినిమా యూనిట్ తో కలిసి దుబాయ్ కి వెళ్లారు మల్లిక, ఎంతో భారీ బడ్జెట్ సినిమా కావటంతో వారం రోజులకు పైగా అక్కడే ఉన్నారు.. అదే సమయంలో ఓ స్టార్ హీరో తనను వేధించాడని ఆమె చెప్పుకొచ్చింది. నేను దుబాయిలో ఓ పెద్ద సినిమా షూటింగ్లో పాల్గొన్నాను ... ఆ మూవీలో ఎంతోమంది స్టార్ నటులు నటిస్తున్నారు.  సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ కూడా వచ్చింది. అలాగే ఆ సినిమా మంచిగా హిట్ అయింది. అందులో నేను ఒక కామెడీ రోల్ లో నటించాను. అప్పటి వరకు అంతా బాగానే నడిచింది . ఆ సినిమా హీరో అర్ధరాత్రి వచ్చి నా గది తలుపు కొట్టేవాడు అతడు తలుపు బద్దలు కొడతాడేమో అని ఎంతో భయపడేదాన్నో గట్టిగా నా గది త‌లుపును బద్దలు కొట్టే విధంగా కొట్టేవాడు..

అతను నా గది దగ్గరికి రాకూడదని ఎన్నోసార్లు అనుకున్నాను ఈ ఘటన తర్వాత మళ్లీ ఆ హీరోతో కలిసి సినిమా చేయలేదని ఆమె చెప్పుకొచ్చింది. చిత్ర పరిశ్రమలో మల్లికకు ఇలాంటి లైంగిక వేధింపులు జరగటం మొదటిసారి కాదు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అయితే మల్లికా ఎక్కడ ఆ హీరో పేరును బయటకు చెప్పలేదు. ‘విక్కీ విద్యా క వో వాలా వీడియో’ సినిమా అక్టోబ ర్ 11న విడుదల కానుంది. కొన్నాళ్ల తర్వాత మళ్లీ హిందీలో నటిస్తుంది మల్లిక. ఇందులో త్రిప్తి డిమ్రీ, రాజ్‌కుమార్‌ రావ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2003లో సినిమా రంగ ప్రవేశం చేసిన మల్లికా.. ‘క్వాహిష్’ సినిమా ద్వారా హీరోయిన్‌గా మెరిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: