సూపర్ స్టార్ కృష్ణ అంటే ఆ స్టార్ హీరోయిన్ కు అంత భయమా.. అసలు విషయం ఇదే..!
ఇంతకీ ఆ హీరోయిన్ సూపర్ స్టార్ కృష్ణకు ఎంతో దగ్గర సంబంధం ఉందట. ఆ కారణం గానే ఆ హీరోయిన్ చాలా రోజులు వరకు కృష్ణతో సినిమాలు చేయాలంటే భయపడేదని అప్పట్లో వార్తలు వచ్చేవి . ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు సహజనటి జయసుధ . కృష్ణ గారి భార్య విజయనిర్మల కు జయసుధ చాలా దగ్గర బంధువట . విజయనిర్మల ఆమె కు మేనత్త వరుస అవుతారు. అలాగే కృష్ణ - విజయ నిర్మల కాంబినేషన్లో వచ్చిన ‘పండంటి కాపురం’ సినిమా లో జయసుధ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు . విజయ నిర్మల గారే ఆమె ను ఈ పాత్ర కు ఎంచుకుని ఇండస్ట్రీకి పరిచయం చేశారట .
అందుకోసమే జయసుధ - కృష్ణను చూస్తే భయపడిపోయేదని అంటారు. అలా కృష్ణతో చాలాకాలం సినిమాలు చేయలేదట . ఆ తర్వాత విజయనిర్మల భయం పోగొట్టి వారిద్దరిని కలిపి సినిమాలు చేయించిందని కూడా అంటారు. ఆ తర్వాత జయసుధ ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి .. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తూ సహజ నటిగా గుర్తింపు తెచ్చుకుని ఇప్పటికీ వరుస సినిమాల తో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.