నాగార్జున, బిగ్ బాస్ పై.. బయటొచ్చాక నిందలేస్తున్న సోనియా.. ఏమందో తెలుసా?

praveen
ప్రేక్షకులు అందరూ ఇష్టపడే బిగ్బాస్ రియాలిటీ షో ఇప్పుడు ఎనిమిదవ సీజన్ అందరిని అలరిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎప్పటిలాగానే ప్రతివారం ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే గత వారం సోనియా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈమె ఎలిమినేషన్ అందరూ ఊహించింది మాత్రమే కాదు అందరూ కోరుకుంది కూడా. ఎందుకంటే హౌస్ లో ఉండి ఆమె ప్రవర్తించిన తీరు బయట తీవ్రస్థాయిలో నెగిటివ్ కి కారణమైంది. ఈ క్రమంలోనే బయటికి వచ్చిన తర్వాత సోనియా బిగ్ బాస్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.

 ఈ క్రమంలోనే ఇటీవల బిగ్ బాస్ గురించి సోనియా సంచలన వ్యాఖ్యలు చేయడం వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది  బిగ్ బాస్ షోలో నన్ను బయటకి నెగిటివ్గా చూపించారు అంటూ ఆరోపించింది సోనియా. రియాలిటీ షో అంటే జీవితానికి సరిపడా అనుభవాలు నేర్పించుకోవచ్చు అనుకున్నా. కానీ నన్ను రోడ్డున పడేశారు. నన్ను కావాలని బ్యాడ్ చేశారు. నేను విష్ణు ప్రియ ను టార్గెట్ చేసానంటున్నారు. కానీ విష్ణునే నన్ను టార్గెట్ చేసింది. నిఖిల్ విషయానికి వస్తే అతను డిప్రెషన్ లో ఉన్నాడు నన్ను ఫామిలీ అని భావించాడు. ఆల్రెడీ డిప్రెషన్ లో ఉన్నాడు కదా అని సపోర్ట్ చేశాను. నా పెళ్ళికి నిఖిల్ కు చైన్, పృథ్వి కి ఇయర్ రింగ్స్ ఇస్తానని కూడా చెప్పాను. నా మాటల్ని ఇష్టమొచ్చినట్లుగా కట్ చేసి బయటకు చూపించారు  నేను హౌస్ లో ఏ తప్పు చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది సోనియా.

 సాధారణంగా బయట గైడెన్స్ ఎలా ఇస్తానో హౌస్ లో కూడా అలాగే ఇచ్చాను   అందులో తప్పేముంది. నా సలహాలు తీసుకోకపోవడం తీసుకోవడం వాళ్ళ ఇష్టం  బిగ్ బాస్ హౌస్ లో నేను నాలాగే ఉన్నాను. యాక్టింగ్ ఎక్కడ చేయలేదు. ప్రతిచోట గేమ్ గురించి మాట్లాడాను. కానీ ఎవరిని పర్సనల్గా అటాక్ చేయలేదు. నిఖిల్ పృధ్విని మాత్రమే చూస్తే ఎలా నన్ను కూడా చూడు అని యష్మితో అన్నాను. దీన్ని తప్పుగా చూపించారు. నాగార్జున గారూ కూడా నా వైపు నిలబడలేదు. ఇక్కడ నిజాయితీ ఏమైపోయింది. బిగ్ బాస్ లైవ్ షో అనుకున్నాను. కానీ అది తప్పని తెలిసింది. యష్ అనే వ్యక్తిని నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్న. కానీ ఆల్రెడీ పెళ్లి అయిన వ్యక్తితో డేటింగ్ లో ఉన్నట్లు పుకార్లు లేపారు  కామెంట్స్ చేసింది సోనియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: