త్రిష రిజెక్ట్ చేసిన మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న కాజల్.. చేసుంటే బ్యూటీ కెరీర్ వేరే లెవల్లో ఉండేది..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన వారిలో త్రిష ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన కెరియర్లో చాలా సినిమాలను వదులుకుంది. అలా ఈ మధ్య కాలంలో త్రిష ఓ స్టార్ హీరో సినిమాలో అవకాశాన్ని వదులుకోగా అందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఏది ..? అనే వివరాలను తెలుసుకుందాం. నందమూరి నట సింహం బాలకృష్ణ ఆఖరుగా భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... శ్రీ లీలా ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మొదట ఈ మూవీ బృందం బాలయ్య కు జోడిగా త్రిష ను హీరోయిన్గా తీసుకోవాలి అనుకున్నారట. అందులో భాగంగా ఈ మూవీ బృందం ఆమెను సంప్రదించి కథను కూడా వివరించిందట. కథ మొత్తం విన్నాక త్రిష స్టోరీ సూపర్ గా ఉంది. కానీ ఈ సినిమా సమయంలో నాకు వేరే సినిమా కమిట్మెంట్లు ఉన్నాయి. అందువల్ల నేను ఈ సినిమా చేయలేను అని చెప్పిందట.

దానితో ఏమీ చేయలేని ఈ మూవీ యూనిట్ కాజల్ అగర్వాల్ ను ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలి అని ఆమెను సంప్రదించడం జరిగిందట. ఆమె ఈ మూవీ లో హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అలా భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారట. ఇక భగవంత్ కేసరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా కాజల్ కి మంచి గుర్తింపు కూడా లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: