గేమ్ చేంజర్ కోసం అనిరుద్.. ఈ దెబ్బతో అంచనాలు డబల్ అయినట్లేనా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కియార అద్వానీ ఈ సినిమాలో చరణ్ కు జోడిగా నటించగా ... గ్రేట్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుండి మూవీ బృందం వారు రెండు పాటలను విడుదల చేశారు. ఆ రెండు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ నెల చివరి వరకు ఈ మూవీ నుండి మూడవ పాటను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ మూడవ సాంగ్ కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయంలోకి వెళితే ... గేమ్ చేంజర్ మూవీ నుండి విడుదల కాబోయే మూడవ సాంగ్ కి జానీ , మాస్టర్ కొరియోగ్రఫీ చేసినట్లు , ఇక ఈ సాంగ్ నీ అనిరుద్ రవిచంద్రన్ పాడినట్లు ఈ సాంగ్ కి తమన్ అదిరిపోయే రేంజ్ మ్యూజిక్ ను అందించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇక నిజంగానే అనిరుద్ కనుక ఈ మూవీలోని సాంగ్ ను పాడినట్లు అయితే ఒక్క సారిగా ఈ మూవీ ఆల్బమ్ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: