నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఇవే.. ఏకంగా ఆ ప్లేస్లో దేవర..?

Pulgam Srinivas
నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీలు ఏవి ... అందులో దేవర ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ మూవీ నైజాం ఏరియాలో టోటల్ బాక్సాఫీస్ రన్ ముగిసే సరికి 111.85 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. కల్కి 2898 AD సినిమా నైజాం ఏరియాలో టోటల్ రన్ ముగిసే సరికి 92.80 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. సలార్ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి నైజాం ఏరియాలో 71.40 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. బాహుబలి 2 మూవీ నైజాం ఏరియాలో టోటల్ రన్ ముగిసే సరికి 68 కోట్ల కనెక్షన్లను వసూలు చేసింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మూవీ కేవలం ఆరు రోజుల్లోనే నైజాం ఏరియాలో 48.27 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్లను వసులు చేసిన సినిమాల లిస్టులో ఇప్పటికే ఐదవ స్థానంలోకి వచ్చేసింది. అలా వైకుంఠపురంలో సినిమా నైజం ఏరియాలో 44.88 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. 

బాహుబలి పార్ట్ 1 మూవీ నైజాం ఏరియాలో 43 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. కన్నడ డబ్బింగ్ సినిమా అయినటువంటి కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ నైజాం ఏరియాలో 42.93 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. పుష్ప పార్ట్ 1 మూవీ నైజాం ఏరియాలో 40.74 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. సరిలేరు నిక్కేవరు సినిమా నైజాం ఏరియాలో 39.97 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో పదవ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు నైజాం ఏరియాలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 సినిమాల లిస్టు లో ఈ మూవీలు నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: