ఏకంగా నాని నటించిన అన్ని సినిమాలను రిజెక్ట్ చేసిన సమంత.. కారణం అదేనా..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి సమంత తన కెరియర్ లో ఎప్పటి వరకు చాలా సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సమంత రిజెక్ట్ చేసిన సినిమాలలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను సాధించగా మరికొన్ని బోల్తా కొట్టినవి కూడా ఉన్నాయి. ఇకపోతే నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన కొన్ని సినిమాలలో కూడా సమంత హీరోయిన్గా కూడా నటించింది. నాని హీరోగా రూపొందిన రెండు సినిమాలలో హీరోయిన్ అవకాశం వచ్చినా కూడా సమంత రిజెక్ట్ చేసిందట. ఆ మూవీలు ఏవి ..? అవి ఎలాంటి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం నాని , శివ నర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్గా మొదట అవకాశం సమంత కే వచ్చిందట. కానీ ఈ ముద్దుగుమ్మ ఆ సమయం లో వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పిందట. ఇక పోయిన సంవత్సరం నాచురల్ స్టార్ నాని "దసరా" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ... కీర్తి సురేష్ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో హీరోయిన్గా మొదటగా సమంత ను తీసుకోవాలి అని ఈ మూవీ బృందం అనుకుందట.

అందులో భాగంగా ఈమెను కలిసి కథను కూడా ఈ మూవీ బృందం వారు వినిపించారట. కాకపోతే ఈమె ఆ సమయంలో ఇతర మూవీలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పిందట. దానితో ఈ మూవీ లో కీర్తి సురేష్ ను హీరోయిన్గా మేకర్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా నాని హీరోగా రూపొంది మంచి విజయాలను అందుకున్న నిన్ను కోరి , దసరా మూవీలను సమంత రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: