ఏకంగా పాన్ ఇండియా స్టార్ తో నాచురల్ స్టార్.. ఇండియన్ బాక్స్ ఫీస్ షేక్ అవ్వాల్సిందే..!

Amruth kumar
టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్న హీరోలలో నాచురల్ స్టార్ నాని కూడా ఒకరు.. ఇప్పటికే దసరా, హాయ్ నాన్న, తాజాగా సరిపోద‌ శనివారం సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు. ప్రేక్షకుల్లో తన సినిమాలు తో ప్రత్యేక క్రేజ్ అందుకున్న నాని వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ వ‌రుస విజ‌య‌లు అందుకుంటున్నాడు. రీసెంట్గా నాని నటించిన సరిపోదా శనివారం మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది. థియేటర్లో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఓటిటిలో కూడా అదే క్రేజ్‌తో దూసుకుపోతుంది.
అయితే ఇప్పుడు నాని కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. హిట్‌ 3 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే క్రైం థ్రిల్లర్గా వచ్చిన హిట్‌ సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాల్లో హీరోలుగా నటించిన విశ్వక్ సేన్ , అడవి శేష్ లు కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి. కాగా ఇప్పుడు వచ్చే హిట్ 3 లో నాని హీరోగా నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు నిర్మాత కూడా ఆయనే.
శైలాష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నానికి జంటగా  స్టార్ హీరోయిన్ నటిస్తుందని అంటున్నారు. కేజీఎఫ్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుందని అంటున్నారు. యష్ హీరోగా వ‌చ్చిన‌ కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి తన అందంతో పాటు నటనతో నూ అకట్టుకుంది . ఆ తర్వాత ఈ భామ విక్రమ్ సరసన కోబ్రా అనే సినిమా చేసింది . ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు నాని సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది . త్వరలోనే దీని పై కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని కూడా అంటున్నారు. ఇక మరి నాని ఈ సినిమాకి ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: