సంక్రాంతి పండు గ వచ్చిం ది అం టే చాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి వాతావ రణం నెలకొంటూ ఉంటుంది . అనేక మంది స్టార్ హీరోలు సినిమాలు ఆ సమయంలో విడుదల అవుతూ ఉంటాయి 2001 వ సంవత్సరం సంక్రాం తి పండుగ సందర్భం గా బాక్స్ ఆఫీస్ దగ్గర అతి పె ద్ద యుద్ధం జరిగిం ది. అసలు అ ప్పుడు ఎవరి సినిమాలు రిలీజ్ అయ్యాయి ..? అందు లో ఏ సినిమా సంక్రాంతి విన్న ర్ గా నిలిచిం ది అనే వివరాలను తెలుసు కుందాం.
2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మొదటగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన మృగరాజు మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయింది. ఇక ఆ తర్వాత నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ నరసింహ నాయుడు విడుదల అయింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన దేవీపుత్రుడు సినిమా విడుదల అయింది. ఈ మూడు సినిమాలు కూడా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యాయి.
ఇందులో మొదట విడుదల అయిన మృగరాజు సినిమా ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. చివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ఇంపాక్ట్ ను చూపలేకపోయింది. ఇక నరసింహ నాయుడు సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దేవీపుత్రుడు సినిమా యావరేజ్ టాక్ ను తెచ్చుకొని పర్వాలేదు అనే కలెక్షన్లను వసూలు చేసి మీడియం రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇక 2001 సంవత్సరం బాలయ్య "నరసింహ నాయుడు" సినిమాతో సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు.