'అన్ స్టాపబుల్ 3' కోసం బాలయ్య రెమ్యూనిరేషన్.. ప్రభాస్, రాజమౌళి లనే మించి పోయాడుగా..!
ఇక రెండు సీజన్స్ తో కలిపి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్లు కూడా గెస్ట్లుగా వచ్చారు. ఇక ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఒక్కరే మిగిలి ఉన్నారు. అలాగే బాలకృష్ణ తోటి స్టార్ అయిన వెంకటేష్ , నాగార్జున మరియు మెగాస్టార్ చిరంజీవి వంటి వారి కూడా ఈ షో కి రావాల్సి ఉంది . వీళ్ళందర్నీ కవర్ చేయడానికి మరి కొద్ది రోజుల్లోనే 'అన్ స్టాపబుల్3 ముందుకు రాబోతుంది. దసరా కానుకగా మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇక తొలి ఎపిసోడ్ కు గెస్ట్లుగా దుల్కర్ సల్మా, వెంకీ అట్లూరి వచ్చారు.
అయితే 'అన్ స్టాపబుల్ షో కోసం బాలయ్య రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సీజన్ లో మొత్తం 14 ఎపిసోడ్లు ప్లాన్ చేశారు. ఈ 14 ఎపిసోడ్స్ గాను బాలయ్య, అల్లు అరవింద్ దగ్గర నుంచి 20 కోట్ల కు పైగా రెమ్యూనిరేషన్ అందుకోబోతున్నారట. ఇక బాలయ్య ఒక్కో సినిమాకు 10కోట్ల కంటే తక్కువే రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు.. కానీ అన్ స్టాపబుల్ షో కోసం ఆయన ఈ రేంజ్ లో డిమాండ్ చేయటం పెద్ద చర్చకు దారి తీసింది.. అన్ స్టాపబుల్ షో కారణంగానే ఇండియాలోనే టాప్ మోస్ట్ ఓటీటీ యాప్స్ లో ఒకటిగ ఆహా నిలిచింది కాబట్టి బాలయ్య ఆమాత్రం డిమాండ్ చేయడం లో ఏమాత్రం తప్పులేదు అంటూ అభిమానులు అంటున్నారు.