కొన్ని సంవత్సరాల క్రితం రీమిక్ సినిమాలో ట్రెండ్ జోరుగా కొనసాగుతూ ఉండేది. ఓ భాషలో ఓ సినిమా విడుదల అయ్యి మంచి టాక్‌ను తెచ్చుకుంది అంటే వెంటనే ఆ సినిమా యొక్క హక్కులను కొని దానిని ఇతర భాషలో రీమిక్ చేసే సంప్రదాయం అన్ని ఇండస్ట్రీలలో కొనసాగింది. కానీ ఈ మధ్యకాలంలో రీమిక్ సినిమాల ట్రెండ్ పెద్దగా కొనసాగడం లేదు. ఎందుకు అంటే ఏదైనా సినిమా విడుదల అయ్యి మంచి టాక్ ను తెచ్చుకొని కలెక్షన్లను రాబడుతుంది అంటే అలాంటి సినిమాలు నెల లేదా రెండు నెలల్లో ఏదో ఒక ఓ టీ టీ లోకి వచ్చేస్తున్నాయి.
దానితో ఓ టీ టీ లోనే ప్రపంచంలో ఎక్కడ ఉన్న ప్రేక్షకులు అయిన సినిమాను చూసేస్తున్నారు. అలాంటి సందర్భంలో రీమిక్ సినిమాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఇకపోతే ఇలాంటి సమయంలో కూడా కొన్ని సినిమాలు ఆల్రెడీ తెలుగులో డబ్ అయ్యి విడుదల అయిన తర్వాత తెలుగు లో రీమేక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో విడుదల అయిన వీరమ్ సినిమాని కాటమ రాయుడు అనే పేరుతో రీమిక్ చేశాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడి గా శృతి హాసన్ హీరోయిన్గా నటించింది.
అలాగే వినోదయ సీతం అనే పేరుతో తెలుగులో విడుదల అయిన సినిమాను బ్రో అనే టైటిల్ తో రీమేక్ చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి తెలుగులో విడుదల అయిన లూసీఫర్ సినిమాను గాడ్ ఫాదర్ అనే టైటిల్ తో ఆ సినిమాను రీమేక్ చేశాడు. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలు మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా ఇలా తెలుగులో ఆల్రెడీ డబ్ అయ్యి విడుదల అయిన తర్వాత రీమిక్ చేసిన సందర్భాలు ఉన్నాయి.