ప‌వ‌న్ ప‌ట్టుద‌ల‌కు అన్‌స్టాప‌బుల్ హ్యాట్సాఫ్‌..?

RAMAKRISHNA S.S.
- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) .
జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుదలకు రాజకీయ వర్గాలకు అతీతంగా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లారు. ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్లే వాళ్ల‌కు తెలుసు ఎంత కష్టమో. మెట్ల మార్గం ద్వారా వెళితే రెండు గంటలలో వెళ్ళిపోవచ్చు .. కానీ పవన్ కళ్యాణ్ అలిపిరి మార్గాన్ని ఎంచుకున్నారు. మంచి వయసులో ఉన్నవారికి ఈ మార్గంలో వెళ్లాలంటే కనీసం నాలుగు గంటల సమయం పడుతుంది. పవన్ కళ్యాణ్ ఎంత కష్టమైనా ఏ మాత్రం తగ్గకుండా నడుచుకుంటూ వెళ్తారు. తిరుమ‌ల వెంక‌న్న‌ దేవుడికి లడ్డూ కల్తీ విషయంలో జరిగిన అపచారానికి .. భక్తుల‌కి తన వంతు ప్రాయశ్చిత్తం చేశారు. అయితే దీన్ని కొంతమంది వైసీపీ నేతలు ట్రోల్ చేస్తున్నారు. ఓ వ్యక్తి కష్టం చూసి ఎవరు ట్రోల్ చేయరు .. అలా చేస్తే కచ్చితంగా సైకోలే అవుతారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం తన వాయిస్ ని గట్టిగా వినిపిస్తున్నారు.

ఈ విషయంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా తగ్గేది లేదని .. తన నడక యాత్ర ద్వారా నిరూపించారు. గతంలోనూ పవన్ ఇలా నడుచుకుంటూ తిరుమల కు వెళ్లారు .. అప్పుడు కూడా ఇబ్బంది పడ్డారు.. కానీ ఇప్పుడు మరింత వ‌య‌స్సు పెరిగినా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పవన్ ను ట్రోల్ చేసే వాళ్ళు తమ లీడర్ ఎలా నడవగలరో లేదో అంచనా వేసుకోవాలన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. గట్టిగా 10 నిమిషాలు నిలబడి విన‌తి పత్రాలు తీసుకోలేరని అనేకసార్లు వెళ్లడైంది. తిరుమలకు కాలినడకన వస్తానని ప్రచారం చేసుకుని దేవుడి ని వాడుకోవటం తప్ప ఇప్పటివరకు ఎప్పుడు ఇలా విమ‌ర్శించే వారి అభిమాన నాయకుడు తిరుమలకు నడుచుకుంటూ రాలేదు. దీనినే ఇప్పుడు జనసేన వాళ్లు గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో పవన్ పట్టుదలకు ప్రతి ఒక్కరు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: