కెరీర్ మొత్తంలో చరణ్ కోసం మాత్రమే ఆ పని చేశాను.. శంకర్..?

Pulgam Srinivas
ఇండియా వ్యాప్తం గా సూపర్ క్రేజ్ కలిగిన దర్శకుల లో శంకర్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి అందులో చాలా మూవీ లతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తం గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు . శంకర్ ఆఖరుగా కమల్ హాసన్ హీరోగా రూపొందిన ఇండియన్ 2 మూవీ కి దర్శకత్వం వహించాడు . భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది . తాజాగా శంకర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా కియార అద్వానీ హీరోయిన్గా గేమ్ చేంజర్ అనే మూవీ ని రూపొందించాడు.

ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ను విడుదల చేసింది. ఈ మూవీలోని రెండవ పాట విడుదల కోసం ఈ మూవీ యూనిట్ చిన్న పాటి ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్లో భాగంగా శంకర్ మాట్లాడుతూ ... నేను ఇప్పటివరకు నా కెరియర్ లో ఎన్నో సినిమాలుకు దర్శకత్వం వహించాను.

కానీ ఎప్పుడు కూడా హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రీకరించలేదు. మొట్ట మొదటి సారి నా కెరియర్లో రామ్ చరణ్ కోసం గేమ్ చేంజర్ మూవీ లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రకరించాను అని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. మిమ్మల్ని అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది అని శంకర్ చెప్పుకొచ్చాడు. ఈ మూవీ పై ప్రస్తుతానికి ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: