టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో శ్రీను వైట్ల ఒకరు. ఈయన కెరియర్ను ప్రారంభించిన బిగినింగ్ నుండే మంచి విజయాలను అందుకుంటూ వచ్చాడు. దానితో చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి స్థాయి ఉన్న దర్శకుడిగా మారిపోయాడు. ఇకపోతే ఈయన దర్శకత్వం వహించిన వెంకీ , దుబాయ్ శీను , నమో వెంకటేశా , దూకుడు సినిమాలు అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఈ మూవీలతో శ్రీను వైట్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుల స్థాయికి చేరుకున్నాడు. దూకుడు మూవీ తర్వాత ఈయనకు ఆ స్థాయి విజయం మళ్ళీ దక్కలేదు.
దూకుడు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించాడు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల "ఆగడు" మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఆగడు మూవీ ఫ్లాప్ కావడానికి గల కారణాలను ఆయన తెలియజేశాడు. తాజాగా శ్రీను వైట్ల మాట్లాడుతూ ... దూకుడు మూవీ హిట్ తర్వాత మహేష్ బాబు తో మరో సినిమా అవకాశం వచ్చింది. దానితో చాలా పెద్ద బడ్జెట్ తో , చాలా పెద్ద సినిమా చేయాలి అనుకున్నాను. అందుకు తగిన కథను కూడా రెడీ చేసుకుని మహేష్ కి వినిపించాను. ఆయన కూడా సూపర్ గా ఉంది అన్నాడు.
కానీ ఆ సినిమా చేయాలి అంటే బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది. ఆ సినిమా నిర్మాతలు నా ఫ్రెండ్స్. వారి ఆర్థిక పరిస్థితులు ఆ టైమ్ లో బాగోలేదు. దానితో ఆ సబ్జెక్టును పక్కన పెట్టేసి తక్కువ బడ్జెట్లో ఓ చిన్న విలేజ్ సెట్ లో మూవీ ని చేద్దాం అని అనుకున్నాం. అందుకు తగిన కథను రెడీ చేసాం. ఆ కథను కూడా చాలా సిన్సియర్ గా తెరకెక్కించాను. కానీ ఆ సినిమా జనాల్ని పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా ఫ్లాప్ కావడానికి నేనే ప్రధాన కారణం అని శ్రీను వైట్ల తాజాగా చెప్పుకొచ్చాడు.