సరిపోదా శనివారం :దర్శకుడు ఆ తప్పు చేసి ఉండకూడదు.. అయినా అద్భుతమే.. పరుచూరి గోపాలకృష్ణ..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న కథ రచయితగా పేరు తెచ్చుకున్న వారిలో పరుచూరి గోపాలకృష్ణ ఒకరు. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు కథలను అందించి వాటితో అద్భుతమైన విజయాలను హీరోలకు అందించి గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఈయన పెద్దగా సినిమాలకు కథలను అందించడం లేదు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఈయన వరుస సినిమాలకు కథలను అందిస్తూ ఎంతో బిజీగా సమయాన్ని గడిపారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య పరుచూరి గోపాలకృష్ణ గారు యూట్యూబ్ వేదికగా తన పాత సినిమాల అనుభవాలను , అలాగే కొత్త సినిమాలకు సంబంధించిన రివ్యూలను తరదైన కోణంలో ఇస్తూ వస్తున్నాడు.

అందులో భాగంగా తాజాగా నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం గురించి తన అభిప్రాయాలను విడుదల చేశాడు. ఇకపోతే పరుచూరి గోపాలకృష్ణ "సరిపోదా శనివారం" మూవీ గురించి మాట్లాడుతూ ... సరిపోదా శనివారం సినిమా చూస్తుంటే మేము పని చేసిన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ మూవీ గుర్తుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో స్టువర్టుపురం విలేజ్ లాగా సోకులపాలెం అనే ఒక ఊరిని సృష్టించారు. ఆ ఊరిలో ఉన్న ప్రజలందరికీ ధైర్యం ఉండదు. వారిలో ధైర్యం నింపే పాత్రను నాని చేశాడు. టైటిల్ జస్టిఫికేషన్ కోసం దర్శకుడు మంచి పాయింట్ను తీసుకున్నాడు. సినిమా తల్లితో మొదలై చెల్లెలు సన్నివేశాలతో ముగుస్తుంది. అది కూడా ఒక అద్భుతం. ఇక సినిమాలో విలన్ పాత్రలో నటించిన ఎస్ జె సూర్య సూపర్ యాక్టింగ్ తో మెప్పించాడు.

ప్రియాంక ఆరుల్ మోహన్ కూడా తన నటనతో బాగానే ఆకట్టుకుంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ తన దర్శకత్వంతో ప్రేక్షకులను అలరించాడు. సినిమా అంతా బాగానే ఉంది కానీ ఒక 20 నిమిషాల రన్ టైమ్ ను తగ్గించి ఉంటే ఇంకా బాగుండేదేమో ... అయిన కూడా ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది అని పరుచూరి గోపాలకృష్ణ తెలియజేశాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న సరిపోదా శనివారం సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pgk

సంబంధిత వార్తలు: