వామ్మో, తమన్నా సిగ్గు లేకుండా ఇలాంటి కామెంట్స్ చేస్తోందేంటి..?

praveen
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్లలో ముందు వరసలో ఉంటుంది మిల్కీ బ్యూటీ తమన్నా. తెలుగు తమిళం మలయాళం కన్నడ సినిమాలో నటించేటప్పుడు తమన్నా చాలా పద్ధతి అయిన పాత్రలు పోషించింది కానీ ఎప్పుడైతే ఆమె హిందీ వెబ్ సిరీస్లో సినిమాలు చేయడం మొదలుపెట్టిందో అప్పటినుంచి చాలా హద్దులను దాటేస్తోంది. తొలి సినిమా తర్వాత ఈ అందాల తారకు సౌత్ ఇండస్ట్రీలో మరింత డిమాండ్ పెరిగిపోయింది మంచి పాత్రలు చేస్తూనే ఈ బ్యూటీ ఇంకా క్రేజ్ పెంచుకోవచ్చు కానీ ఐటమ్ సాంగ్స్, బోల్డ్ వెబ్‌సిరీస్‌లు చేస్తూ షాక్‌లిస్తోంది. బాగానే సంపాదిస్తుంది కానీ ఆమె బోల్డ్ అవతారం ఎత్తడమే తమన్నా ఫ్యాన్స్ కి మింగుడు మింగుడు పడడం లేదు. మరోవైపు ఈ తార విజయ్‌ వర్మ అనే మరొక నటుడితో ప్రేమలో పడింది. ఆ విషయాన్ని మీడియా ముందు ఒప్పుకుంది కూడా. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి ఫాన్స్ హార్ట్స్‌ని పిండేసింది.
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా లస్ట్‌ స్టోరీస్ వెబ్ సిరీస్ లో లిమిట్ దాటి మరి రొమాన్స్ చేశారు. అలాంటి క్యారెక్టర్ కి ఎలా ఒప్పుకున్నావ్? అని తమన్నాని అడిగితే ఆమె మాత్రం క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర అయినా చేస్తానని చెప్పింది. తాజా ఇంటర్వ్యూలో మరొకసారి సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ లో నటించడం పై కొంచెం కూడా సిగ్గుపడకుండా మాట్లాడింది. చాలా మంది హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి ఒప్పుకోరు కదా మరి మీరు ఎందుకు అవి చేస్తున్నారు అని ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.
రొమాంటిక్ సీన్లు, శృంగార సన్నివేశాలు చేయాలని ఏ హీరోయిన్ కి ఇష్టం ఉండదు కానీ ఆ సీన్స్ సినిమాకు అవసరం కాబట్టి తప్పదు అని చెప్పుకొచ్చింది. అలాగే మిగతా హీరోయిన్లు ఎలా ఉన్నా స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఇలాంటి సన్నివేశాల్లో వెంటనే ఆ సీన్లలో నటించేస్తానని దర్శకులకు ఎవరికీ పని కలిగించాలని ఆమె తెలిపింది. ఓపెన్ గా చేసిన ఈ కామెంట్స్ లో చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: