కాంతార ప్రీక్వెల్లో మరో సూపర్ స్టార్.. బొమ్మ షేక్ అవ్వాల్సిందే..!

Divya
ప్రాంతీయ సినిమాగా వచ్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న కన్నడ మూవీ కాంతారా గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ సినిమాతో అప్పటివరకు కన్నడ ఇండస్ట్రీకే పరిమితమైన డైరెక్టర్ రిషబ్ శెట్టి నటుడిగా కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం రిషబ్ ఈ సినిమా ప్రీక్వెల్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ గ్లింప్ టీజర్ కూడా విడుదల చేశారు చిత్ర బృందం. కన్నడ చిత్ర సీమకు కొత్త ఇమేజ్ కాంతారా తీసుకొచ్చింది. అభిమానులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇదిలా ఉండగా కాంతారా చాప్టర్  -1  కు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఆయన నటిస్తున్నారని తాజా వార్తలు వినిపిస్తున్నాయి.  ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇకపోతే ఈ ఏడాది ఏప్రిల్ లో రిషబ్ శెట్టిని మోహన్ లాల్ కలుసుకున్నారట. ఆయన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అదే సమయంలో వీరి మధ్య కాంతారా చాప్టర్ -1 గురించి చర్చ జరిగినట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమా మరో లెవెల్ కి వెళ్తుంది అనడంలో సందేహం లేదంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ కాంతారా చాప్టర్ వన్ ప్రస్తుతం నాలుగో షూటింగ్ షెడ్యూలు వచ్చేవారం ప్రారంభం కాబోతోంది. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు అని సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలోనే థియేటర్లలోకి రాబోతున్నట్లు సమాచారం. కాంతారా తో సంచలనం సృష్టించిన ఈ సినిమా ప్రీక్వెల్ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: