రజనీ కాంత్ డిశ్చార్జ్ కావడానికి ఇంకా అన్ని రోజులు పడుతుందా?

praveen
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజు ఉదయం అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి అందరికీ తెలిసినదే. కాగా రజనీకాంత్‌కు ఇచ్చిన చికిత్స గురించి పత్రికా ప్రకటనలో, కార్డియాలజిస్ట్ సాయి సతీష్ నేతృత్వంలోని దాదాపు ముగ్గురు వైద్యుల బృందం ఈ రోజు ఉదయం 6 గంటలకు రజనీకాంత్‌కు శస్త్ర చికిత్స చేసినట్టు తెలుస్తోంది. రజనీకాంత్‌కు ఒక్కసారిగా మూత్ర విసర్జన సమస్య తలెత్తడంతో పొట్ట కింది భాగంలో వాపు రావడం జరిగింది. దీంతో వెంటనే రజనీ ఆస్పత్రిలో చేరడం జరిగింది.
ఈ క్రమంలో ఆయన కడుపులో స్టెంట్ అమర్చారని, స్టెంట్ అమర్చిన తర్వాత రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. శస్త్ర చికిత్స అనంతరం కొన్ని గంటల పాటు ఐసీయూలో ఉన్న రజనీకాంత్‌ను ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకోవడంతో జనరల్ వార్డుకు తరలించినట్టు తెలుస్తోంది. రజనీకాంత్‌ అనారోగ్యంగా ఉన్నారన్న వార్త బయటకి పొక్కడంతో అభిమానులు వేల సంఖ్యలో అపోలో ఆసుపత్రిని చుట్టిముట్టినట్టు తెలుస్తోంది.
ఇకపోతే, రజనీకాంత్‌కి ఇప్పటికే కిడ్నీ మార్పిడి జరగడంతో.. త్వరగా ఇన్ఫెక్షన్ సోకుతుందని వైద్యులు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక రజనీకాంత్‌ను మరో రెండు మూడు రోజుల పాటు వైద్యులు పరిశీలించే అవకాశం ఉందని, అన్ని పరీక్షలు నిర్వహించి, మరో వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఈ విషయాన్ని అపోలో ఆసుపత్రి వర్గాలు చెబుతున్నా.. ఈ సమాచారాన్ని వైద్యులు ఇంకా ధృవీకరించకపోవడం కొసమెరుపు. దాంతోనే రజనీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా రజనీకాంత్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన నటిస్తున్న కూలీ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున కూడా నటిస్తున్న సంగతి తెలిసినదే. రజనీ కోలుకోవలని అభిమాన లోకం పూజలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: