రజినీకాంత్ హెల్త్ బులెటిన్.. వైద్యులు ఏమన్నారంటే..?

Divya
టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ క్రేజీ సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. అయితే రజనీకాంత్ తన సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకున్నారు.. అయితే ఈరోజు ఉదయం నుంచి రజినీకాంత్ అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడ్డారని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపించాయి. ఈ విషయం పైన ఇప్పటివరకు అటు కుటుంబ సభ్యులు కానీ వైద్యులు కాని స్పందించకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా రజనీకాంత్ హెల్త్ అప్డేట్ పైన ఒక విషయాన్ని వైద్యులు తెలియజేసినట్లు తెలుస్తోంది.

వైద్యులు తెలిపిన సమాచారం మేరకు రజనీకాంత్ తీవ్రమైన కడుపునొప్పితో హాస్పిటల్లోకి చేరగా శస్త్రచికిత్స చేసినట్లుగా తెలిపారు.. ఈరోజు ఉదయం వైద్యులు ఆయన పొత్తికడుపులో స్టంట్ వేసినట్లుగా సమాచారం. ప్రస్తుతమైతే రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని మరో మూడు నాలుగు రోజులలో డిశ్చార్జ్ అవుతారంటూ కూడా వైద్యులు తెలియజేశారట. అలాగే రజనీకాంత్ ఆరోగ్యం పైన భార్య లతా స్పందిస్తూ.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అభిమానులు ఎవరూ కూడా భయభ్రాంతులకు గురికావద్దు అంటూ ఎలాంటి అవాస్తవాలు నమ్మవద్దండి అంటూ తెలిపింది.

అభిమానులకు ఆయన క్షేమంగానే ఉన్నారనే విషయం చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియా వేదికగా రజనీకాంత్ అభిమానులే కాకుండా సినీ సెలబ్రిటీలకు కూడా ఆయన కోలుకోవాలని పలు రకాల పోస్టులు పెడుతున్నారు.. మొత్తానికి రజనీకాంత్ అనారోగ్య సమస్యల విషయం పై క్లారిటీ రావడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. రజనీకాంత్ నటించిన వెట్టయాన్ చిత్రం ఈనెల 10వ తేదీన రిలీజ్ కాబోతోంది ఇటీవల జరిగిన ఆడియో ఫంక్షన్ లో కూడా రజనీకాంత్ పాల్గొన్నారు. అలాగే మరొక సినిమా కూలీ లో కూడా నటిస్తూ ఉన్నారు. ఇలా వరుసగా పని లేదా చిత్రాలలో బిజీగా ఉన్న సమయంలో ఒత్తిడి ఎక్కువ ఇవ్వడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడినట్లు సమాచారం .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: