Devara 2: క్లైమాక్స్ లో భారీ ట్విస్ట్.. సీక్వెల్ కోసమే ఆ హీరోని లేపేసారా..?

Divya
ఎన్టీఆర్ దేవర సినిమా గత నెల 27వ తేదీన థియేటర్లో విడుదలై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. మూడు రోజులలోనే 304కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది దేవర సినిమా. అయితే దేవర చిత్రం చూసిన వారందరికీ కూడా ఎన్నో ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి.యతి ఎవరు? మురుగ ఎలా మరణిస్తారు? సముద్రంలో ఉన్న అస్తిపంజరాలు ఎవరివి... దేవరనీ ..వర ఎందుకు చంపుతారు అనే ప్రశ్నలు చాలామందికి సినిమా చూసిన తర్వాత తలెత్తుతూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా దేవర-2 సమాధానం చెబుతుందని చిత్ర యూనిట్ తెలియజేస్తూనే ఉంది.

అయితే తాజాగా దేవర చిత్రంలో నటించిన కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులను సైతం ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకి వచ్చి పలు విషయాలను వెల్లడించారు. దేవర చిత్రంలో బైరా పాత్రలో నటించిన సైఫ్ అలీఖాన్ వద్ద పెరిగిన క్యారెక్టర్లలో ఒక ఐదు మందిని తీసుకువచ్చి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దేవర సినిమా గురించి పలు విషయాలను తెలిపారు. ముఖ్యంగా దేవర చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబి డియోల్ నటించిన సన్నివేశాలు కూడా షూట్ చేశామని తెలిపారు. అయితే దేవర చిత్రంలో అవి కనిపించకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయామని తెలిపారు.

తమతో పాటుగా బాబి డియోల్ మధ్య కొన్ని సన్నివేశాలు ఉన్నాయని క్లైమాక్స్ లో బాబి డియో ఎంట్రీ ఉంటుందని ఈ సినిమాతో సెకండ్ పార్ట్ కి హైట్ పెరిగి లీడ్ కూడా ఇస్తారనుకున్నాము కానీ ఈ చిత్రంలో చూస్తే అసలు బాబి డియోల్ సన్నివేశాలే లేవు అంటూ తెలిపారు ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటులు.. అలాగే సముద్రంలో ఉన్న అస్తిపంజరాలు ఎవరివి దేవరనీ ఎందుకు చంపారు..అని సెకండ్ పార్ట్ లోని క్లారిటీ ఇస్తారంటూ వెల్లడించారు. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ గా మారుతున్నది. దీన్ని బట్టి చూస్తే బాబీ డియోల్ సెకండ్ పార్ట్ కోసమే ఇతని సన్నివేశాలు తీసివేశారని అభిమానులు భావిస్తున్నారు ఇందులో బాబి డియోల్ యతి అనే పాత్రలో నటిస్తున్నారేమో అన్నట్టుగా అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: