పుష్ప భార్య స్నేహపై మెగా ఫామిలీ కుట్రలు ?

Veldandi Saikiran

అల్లు అర్జున్ ఈ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి చిన్న వయసులోనే గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఓవైపు సినిమాలు, మరోవైపు తన ఫ్యామిలీకి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులకు చేరువలో ఉంటాడు. అల్లు అర్జున్ తన అద్భుతమైన నటన, సినిమాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు.

ఇదిలా ఉండగా.... అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. స్నేహ రెడ్డికి హీరోయిన్లతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ బ్యూటీకి ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 9.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారంటే షాక్ అవ్వాల్సిందే. ఇదిలా ఉండగా.... తాజాగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి.
20వ తేదీన మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు జరిగింది. ఉపాసన పుట్టినరోజు సందర్భంగా లావణ్య త్రిపాటి, లక్ష్మీ ప్రణతి, నమ్రత శిరోద్కర్ పలువురు సెలబ్రిటీలు ఉపాసనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి మాత్రం ఉపాసనకు పుట్టినరోజు విషెస్ చెప్పకపోవడం హాట్ టాపిక్ గా మారుతోంది. రీసెంట్ గా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి పుట్టినరోజు వేడుక జరిగింది. సెప్టెంబర్ 29న స్నేహ పుట్టినరోజు.

ఆమె పుట్టినరోజు సందర్భంగా మెగా కుటుంబం నుంచి ఎవరూ కూడా స్నేహ రెడ్డికి బర్త్డే విషెస్ చెప్పలేదు. పైగా తన పార్టీలో మెగా ఫ్యామిలీకి చెందినవారు ఎవరూ కూడా హాజరు కాలేదు. దీంతో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నట్లు క్లారిటీగా తెలిసిపోతోంది. ప్రస్తుతం ఈ రెండు కుటుంబాలకు సంబంధించి సోషల్ మీడియా మాధ్యమాల్లో చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: