యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించగా ... హిందీ నటి జాన్వీ కపూర్ ఈ మూవీ లో ఎన్టీఆర్ కు జోడిగా నటించింది. హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. శ్రీకాంత్ , మురళీ శర్మ , ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర టాప్ వచ్చింది.
అయిన కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫుల్ జోష్ ను చూపిస్తుంది. అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను చేస్తుంది. మరి ముఖ్యంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ మూవీ కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మామూలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో మరో ఒకటి , రెండు రోజుల్లో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని లాభాల్లోకి రాబోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.
అలాగే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమా మరో రెండు , మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే దేవర మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ లో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగాను , మరొక పాత్రలో కొడుకుగానూ నటించి తన నటనతో ప్రేక్షకులను బాగానే మెప్పించాడు.