రాజమౌళి లక్ష రూపాయల అప్పు.. ఆ స్టార్ దర్శకుడు తో ఏంటి సంబంధం..?

Amruth kumar
దర్శకధీరుడు రాజమౌళి ఈ పేరు చెప్తేనే రికార్డులకు చెమటలు పడతాయి.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమాకు చూపించిన దిగ్గజ దర్శకుడు రాజమౌళి. త్రిబుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ అందుకున్న ఈ దర్శకుడు.  ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా ప్రారంభించబోతున్నారు. అలాంటి రాజమౌళి తన కెరీర్ మొదటలో సీనియర్ దర్శకుడు రాఘవేందర్రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన విషయం అందరికీ తెలిసిందేే.
తన గురువు రాఘవేందర్రావు పర్యవేక్షణలో శాంతి నివాసం సీరియల్, స్టూడెంట్ నెంబర్ 1న్ సినిమాలను తెర‌కెక్కించాడు. అలా దర్శకుడిగా మారిన రాజమౌళి కెరీర్ లో ఒక్కటంటే ఒక్క ప్లాఫ్ కూడా లేదు. ఆయనతో సినిమాలు చేసిన ప్రతి ఒక్కరు స్టార్ హీరోలుగా మారారు. ఆయనతో సినిమా చేయడానికి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎందరో హీరోలు ఎదురుచూస్తున్నారు. అలాంటి రాజ్యమౌళి కెరియర్ మొదటిలో అందరిలాగానే డైరెక్టర్ అవ్వాలని  ఇబ్బందులు పడలేదు కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయనకు అండగా నిలిచింది మాత్రం ఆయన గురువు రాఘవేంద్రరావు అనే విషయం రాజమౌళి స్వయంగా ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు.
గతంలో ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. అప్పట్లో ఆర్థిక ఇబ్బంది వచ్చింది అమ్మని అమెరికా పంపించాలి డబ్బులు లేవు.. వెళ్లి రావడానికి లక్ష రూపాయలు కావాలి మాకు వేరే సోర్స్ ఏమీ లేదు అప్పట్లో అది చాలా పెద్ద అమౌంట్.. డైరక్టర్ రాఘవేంద్రరావు గారికి ఎలా చెప్పాలి. అక్క ప్రెగ్నింట్, అమ్మ వెళ్లాలి ఇలా చెప్పాలి అని  ప్రిపేర్ అయ్యాను.  ఎలా అడగాలో అర్దం కాక ఆలోచిస్తున్నాను.  ఒకటికి రెండు సార్లు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్లి.. సార్ ఒక లక్ష రూపాయలు కావాలండీ అని ఇంకా చెప్పబోతున్నాను .. అప్పుడు రాఘవేంద్రరావు గారు వెంటనే నేను చెప్తాను ఆఫీస్ కు వెళ్లి తీసుకో అన్నారు. ఇంట్లో ఎవరినైనా సరే ఓ లక్ష రూపాయలు అడిగామనుకోండి. ఇస్తారు. కానీ ఎందుకు అని అడుగుతారు కదా, కానీ ఆయన అడగలేదు. ఎందుకు ఏమిటి అనలేదు అంటూ రాఘవేంద్రరావు తనను గురువుగానే కాకుండా శ్రేయాభిలాషిగా ఆదుకున్న విధానం రాజమౌళి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: