గేమ్ చేంజర్ డిసెంబర్ లోనే.. కానీ 20న కాదు.. బన్నీ కోసం అలాంటి నిర్ణయం తీసుకున్నాడా..?

Pulgam Srinivas
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మూవీ తర్వాత చరణ్ తన తండ్రి అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య మూవీ లో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ ఈ సినిమాలోని చరణ్ నటనకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలే దక్కాయి. తాజాగా చరణ్ , శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు.

ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. కొంత కాలం క్రితం ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదిన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా నుండి విడుదల అయిన ఏ పోస్టర్లో కూడా ఈ సినిమా విడుదల తేదీని మూవీ బృందం మెన్షన్ చేయలేదు. దానితో ఈ సినిమా డిసెంబర్ 20 వ తేదీన విడుదల అవుతుందా ... లేదా అనే అనుమానాలు జనాల్లో రేకెత్తాయి. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ సంవత్సరం డిసెంబర్ నెలలోనే విడుదల అవుతుంది కానీ 20 వ తేదీన కాదు అని , ఈ సినిమాని డిసెంబర్ 25 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల కానున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్ప పార్ట్ 2 మూవీ రూపొందుతుంది. ఈ మూవీని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ మూవీ కి , ఈ మూవీ కి మధ్య ఎక్కువ గ్యాప్ ఉండాలని గేమ్ చేంజర్ యూనిట్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: