గేమ్ చేంజర్ లో చిరంజీవి రిఫరెన్స్.. అదిరిపోయే హింట్ ఇచ్చిన మూవీ యూనిట్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో హీరోగా నటించాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించని ఉండగా ... కియార అద్వానీ ఈ మూవీలో హీరోయిన్గా కనిపించబోతుంది.

అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను భారీ ఎత్తున చేస్తుంది. అందులో భాగంగా ఈ రోజు ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ అయినటువంటి రా మచ్చ మచ్చ అంటూ సాగే సాంగ్ విడుదల చేయనున్నారు. అందులో భాగంగా ఈ మూవీ నిర్మాత దిల్ రాజు ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన అనంత శ్రీరామ్ సంభాషణకు సంబంధించిన ఒక వీడియోను మేకర్స్ విడుదల చేశారు.

ఇందులో భాగంగా ఈ సినిమాలో చిరంజీవి ఇంద్ర సినిమాలో వేసిన వీన స్టెప్ వచ్చే విధంగా కొన్ని లిరిక్స్ ను అనంత శ్రీరామ్ రాసినట్లు దిల్ రాజు చెప్పుకొచ్చాడు. అలాగే ఆ స్టెప్ మరియు అక్కడ వచ్చే లిరిక్స్ అద్భుతంగా ఉండబోతున్నట్లు కూడా వీరిద్దరూ తెలియజేశారు. ఇక ప్రస్తుతానికి ఈ సాంగ్ పై చరణ్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా మంచి అంచనాలతో ఎదురు చూస్తున్నారు. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: