సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదగడం కష్టం అని చాలా మంది అంటుంటారు. నిజానికి దానిలో కూడా చాలా శాతం వాస్తవం ఉంది. ఎక్కువ శాతం ఇండస్ట్రీలో ఎదిగినవారు ఎవరో ఒకరు బ్యాగ్రౌండ్ ద్వారా ఎదిగిన వారే ఉన్నారు. కానీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా కూడా ఎదిగిన వారు కొంత మంది ఉన్నారు. అలాంటి వారు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఆసక్తి చూపించేవారికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ఇక ఒకానొక సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి అంచలంచలుగా ఎదిగి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు.
అలాగే ఇప్పటికి కూడా అదే స్టార్ డమ్ ను మెయింటైన్ చేస్తున్నాడు. ఇక చిరంజీవి తర్వాత కొంత మంది ఆయన కోవలో వచ్చి సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. కానీ మరి చిరంజీవి స్థాయిలో సక్సెస్ అయిన వారు లేరు అనే చెప్పాలి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరి బ్యాగ్రౌండ్ లేకుండా మంచి స్థాయికి ఎదిగిన నటులలో సత్యదేవ్ ఒకరు. ఈయన విశాఖపట్నం కి చెందిన వాడు. ఇక ఈయనకు సినిమాల్లోకి రావాలి అని ఇంట్రెస్ట్ బాగా ఉండటం , విశాఖపట్నం లో ఉంటే సినిమాల్లో నటించడం కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో హైదరాబాద్ రావాలి అనుకున్నాడు. కానీ సినిమాల కోసం హైదరాబాద్ వెళ్లడం అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని హైదరాబాదులో జాబ్ సంపాదించి అలా హైదరాబాద్ కి వచ్చాడు.
ఇక హైదరాబాద్ కి వచ్చాక సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్నాడు. సినిమాల్లో అవకాశాలు వచ్చాక కూడా ఈయన జాబ్ చేయడం మానేయలేదు. ఉదయం అంతా సినిమాల్లో నటించడం , నైట్ జాబ్ చేయడం చేస్తూ ఉండేవాడు. ఇక జ్యోతిలక్ష్మి సినిమా ఆఫర్ వచ్చిన సమయంలో కూడా ఈయన ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం సత్యదేవ్ తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇలా సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులలో సత్యదేవ్ ఒకరు.