జయం రవి విడాకులకు, నాకు సంబంధం లేదు - సింగర్ కెనీషా..!

Divya
ప్రముఖ కోలీవుడ్ హీరో జయం రవి తన 18 సంవత్సరాల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ.. ఇటీవలే తన భార్య ఆర్తికి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఆయన భార్య ఆర్తి జీర్ణించుకోలేకపోయింది. రహస్యంగా ఉంచాల్సిన ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం పై అసహనం వ్యక్తం చేసింది. కనీసం జయం రవి తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని , అసలు విడాకులు తీసుకోవడం తనకు ఇష్టం లేదు అన్నట్టు కామెంట్లు చేసింది. అయితే ఏది ఏమైనా ఆర్తి మాత్రం తన భర్తకు దూరం అవడం ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితిలో దూరమైందనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే జయం రవి ఆర్తికి విడాకులు ఇవ్వడానికి గల కారణం ప్రముఖ  సింగర్ కెనీషా అని తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన ఈ ముద్దుగుమ్మ గోవాలోని పబ్ లలో పాటలు పాడుతూ అక్కడికి వచ్చే వారిని ఆకర్షిస్తూ అలరిస్తూ ఉంటుందని, ఆమె మాయలో పడి తనకు దూరం అయ్యాడు అంటూ ఆర్తి ఆరోపణలు చేసినట్లు సమాచారం.. అయితే తాజాగా ఈ విషయాలపై సింగర్ కెనీషా స్పందిస్తూ.. అసలు జయం రవి విడాకులు తీసుకోవడానికి కారణం నేను కాదు.. నన్ను వదిలేయండి అంటూ వేడుకుంటుంది అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

కెనీషా మాట్లాడుతూ.. జయం రవికి నాకు మధ్య ఎటువంటి శారీరక సంబంధం లేదు. మా మధ్య ఉన్నది కేవలం బిజినెస్ డీల్ మాత్రమే. ఆయన నాకు బిజినెస్ లో చాలా సపోర్ట్ చేస్తున్నారు.  అన్నింటికీ మించి నాకు మంచి మిత్రుడు కూడా...అందరూ అనుకుంటున్నట్టు జయం రవి విడాకులు తీసుకోవడానికి నేను కారణం కాదు. నాపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని దయచేసి ఆపండి . దయచేసి ఈ వివాదంలోకి నన్ను లాగకండి అంటూ ఒక ఇంటర్వ్యూలో ఈమె అభ్యర్థన చేసింది. మరి జయం రవి విడాకులకు అసలు కారణం ఏంటి అన్నది మాత్రం ఇంకా తెలియ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: