భారతదేశ ప్రజలు వివాహాన్ని అత్యంత గ్రాండ్ గా చేయడానికి అసలు వెనకాడరు. ఎవరి తాహతకు తగ్గట్టుగా వారు పెళ్లిలను నిర్వహిస్తూ ఉంటారు. దానితో పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయింది అంటే చాలు అత్యధిక మొత్తంలో బిజినెస్ జరుగుతుంటుంది. ఇక భారత దేశంలో ఎక్కువ శాతం పండగల సీజన్ పూర్తి అయ్యింది అంటే చాలు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అవుతుంది. ఇక మరికొన్ని రోజుల్లోనే ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ సంవత్సరం నవంబర్ మరియు డిసెంబర్ నెలలో భారీ ఎత్తున ఇండియాలో పెళ్లిళ్లు జరగబోతున్నాయి.
ఇక ఈ రెండు నెలల్లో జరగబోయే పెళ్లిళ్ల కోసం భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న నివేదికల ప్రకారం నవంబర్ డిసెంబర్ ఈ 2 నెలల్లో కలిపి ఇండియా వ్యాప్తంగా దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ 35 లక్షల పెళ్లిళ్ల కోసం దాదాపుగా 4.25 లక్షల కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయింది అంటే చాలు బంగారం అమ్మకాలు భారీగా పెరుగుతూ ఉంటాయి. చాలా మంది పెళ్లిళ్ల లో వధువుకి , వరుడికి అత్యధిక మొత్తంలో బంగారాన్ని నగలను వేస్తూ ఉంటారు. దానితో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయింది అంటే ఇండియా వ్యాప్తంగా బంగారం అమ్మకాలు అత్యధికంగా జరుగుతూ ఉంటాయి.
ఈ రెండు నెలల్లో జరగబోయే పెళ్లిళ్లకు కూడా భారీ మొత్తంలో నగలు అమ్మకాలు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ , డిసెంబర్ ఈ 2 నెలల్లో జరగబోయే పెళ్లిళ్ల ద్వారా ఇండియా వ్యాప్తంగా అత్యంత ఖర్చు జరగబోతున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇక భారత దేశంలో చదువు కంటే కూడా పెళ్లిళ్ల పై అత్యధికంగా ప్రజలు డబ్బును ఖర్చు చేస్తున్నట్లు కూడా కొన్ని నివేదికలు చెబుతున్నాయి.