మెగా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. చిరు ఆ విషయంలో వెనక్కు తగ్గనున్నాడా..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి పోయిన సంవత్సరం రెండు మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటగా వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన చిరంజీవి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఈ మూవీ తో సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత భోళా శంకర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి ఈ మూవీ తో డిజాస్టర్ ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం చిరు , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సోషియో ఫాంటసీ మూవీ లో హీరోవ్గా నటిస్తున్నాడు. ఈ మూవీక్లో త్రిష హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... యూవి క్రియేషన్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ అనుకున్నంత స్పీడ్ గా జరగడం లేదు. ఈ మూవీ జనవరి 10 వ తేదీన విడుదల కావడం కష్టమే అని ఓ వార్త వైరల్ అయింది. దానితో ఈ మూవీ దర్శకుడు వశిష్ట వెంటనే స్పందించి కచ్చితంగా మా సినిమా వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల కానుంది.

అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి చికెన్ గున్యా తో బాధపడుతున్నాడు. దానితో గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. చిరంజీవి పూర్తిగా కోలుకోగానే ఈ సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ కాస్త డిలే అయినా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ కు ఈ మూవీ రావడం కష్టమే అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: