మోక్షజ్ఞ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా.. అదే జరిగితే స్టార్ హీరోలంతా వెనక్కే..!

Divya
ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే నటవారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం సహజం. అయితే తల్లి లేదా తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించుకొని మొదటి సినిమాలో అవకాశాన్ని అందుకుంటారు. అయితే ఆ తదుపరి చిత్ర అవకాశం రావాలి అంటే సొంత టాలెంట్ పై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే చాలామంది సినీ బ్యాక్ గ్రౌండ్ ఉండి, ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన వారు కొంతమంది అయితే, మరి కొంతమంది సక్సెస్ కాలేక నటనతో ప్రేక్షకులను మెప్పించలేక అదృష్టం లేక ఇండస్ట్రీ నుంచి వెనుతిరిగిన వారు కూడా ఉన్నారు. కానీ మరి కొంతమంది ఇప్పటికీ కూడా సక్సెస్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.
అయితే తాను మాత్రం వీటన్నింటికీ దూరం అంటూనే.. భారీ ప్లాన్ తోనే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారట నటసింహా నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ. తాను వేసుకున్న ప్లాన్ గనుక సక్సెస్ అయ్యింది అంటే ఇప్పటివరకు ఉన్న స్టార్ హీరోలు అంతా కూడా వెనక్కి వెళ్ళిపోవాల్సిందే అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే,  చాలా సంవత్సరాల తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తొలిసారి ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.  ఇటీవల సెప్టెంబర్ 6వ తేదీన ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మొదటి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి హనుమాన్ సినిమాతో  భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమా రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాతో తనను తాను స్టార్ హీరోగా మలుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మోక్షజ్ఞ. మొదటి సినిమాతోనే సక్సెస్ సాధిస్తే ఆ తరువాత సినిమాతో కూడా మంచి విజయాన్ని సాధిస్తానని, ముఖ్యంగా పాన్ ఇండియా మూవీతో తొలి అడుగు వేస్తున్నారు కాబట్టి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటే మళ్ళీ వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేదు అనే ప్లాన్ తోనే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారట మోక్షజ్ఞ. అందుకే ప్రశాంత్ వర్మను తన తొలి సినిమా డైరెక్టర్గా ఎంచుకున్నట్లు సమాచారం.  ఒకవేళ మోక్షజ్ఞ అనుకున్న ప్లాన్ కనుక వర్క్ అవుట్ అవుతే ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి ప్రయత్నం లోనే పాన్ ఇండియా స్టార్ అయిపోవడం ఖాయం. ఇన్ని సంవత్సరాలు స్టార్ హీరోలు పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది.  ఏదీ ఏమైనా నటసింహ బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఆలోచనలకి అభిమానుల సైతం దాసోహం అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: