పాత తరం Vs పాన్ ఇండియా తరం ప్రధాన మార్పులు.!
* పాన్ ఇండియా మూవీ పేరుతో యేళ్ళ తరబడి లాక్.!
* అభిమానులకి,హీరోలకి మధ్య గ్యాప్ పెంచేలా.?
* ఒకప్పుడు సంవత్సరానికి రెండు లేదా మూడు సినిమాలు.!
* ప్రస్తుతం పాన్ ఇండియా పేరుతో మూడేళ్లకు ఒకటే సినిమా.!
భారతీయ చలనచిత్ర పరిశ్రమ వివిధ భాషా చలనచిత్ర పరిశ్రమలతో కూడి ఉంటుంది.అయితే పాన్-ఇండియన్ సినిమా అంటే వివిధ భాషలకు చెందిన నటీనటులు కలిసి రావడం కాదు. అందులో భాగం అంతే. పాన్-ఇండియన్ సినిమా అంటే భాషతో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యే కథ మరియు భావోద్వేగం.అలాంటి ఈ పాన్ ఇండియా పేరు అనేది బాహుబలి చిత్రం తర్వాత చిత్ర పరిశ్రమల్లో బాగా వినబడుతుంది.సినిమారంగం అనేది ఓ సృజనాత్మకమైన వ్యాపారం. ఇక్కడ కళతో పాటు కాసులు అనేది కూడా ముఖ్యమైన అంశం.కొన్నేళ్ల క్రితం వరకు తమ భాషా పరిధుల్లోనే సినిమాలు తీసిన దర్శకనిర్మాతలు ఇప్పుడు పాన్ ఇండియా మంత్రం జపిస్తున్నారు. తమ సినిమాల కంటెంట్‌కు విస్త్రతమైన రీచ్‌తో పాటు వాణిజ్యపరంగా కూడా లాభదాయకంగా ఉండటంతో అగ్రహీరోలందరూ పాన్ ఇండియా సినిమాలకే మొగ్గు చూపుతున్నారు.
పాన్ ఇండియా పేరు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన డైరెక్టర్ గా జక్కన్న ప్రఖ్యాతి చెందాడు.అయితే ప్రస్తుత టాలీవుడ్ స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పట్టారు.పాన్ ఇండియా అనే పేరు రాకముందు స్టార్ హీరోలు సంవత్సరానికి కనీసం రెండు లేదా మూడు సినిమాలతో అభిమానులను అలరించేవాళ్ళు.దాని వల్ల వారి అభిమాన హీరోలను ఆన్ స్క్రీన్ పై చూసి సంబరపడేవాళ్ళు. అలాంటి హీరోలకు ఒక్కసారి పాన్ ఇండియా మూవీ చేయడం వల్ల కనీసం మూడు నుండి నాలుగు సంవత్సరాలు ఒకటే సినిమాకి లాక్ అవుతున్నారు. దాని వల్ల వారికీ వారి అభిమానులకి మంచి గ్యాప్ వస్తుంది అలాగే ఎక్సపెక్టషన్స్ కూడా భారీగా పెరిగిపోతున్నాయి. అయితే అలాంటి పాన్ ఇండియా మూవీ విడుదల ఐనా తర్వాత అది కాస్త హిట్ అయితే పర్లేదు కానీ ఏదైనా తేడాకొడితే మాత్రం నిర్మాతలకు చుక్కలు కనబడటం ఖాయం ఎందుకంటె ఒక ఆర్డినరీ సినిమా చేయడానికి ఐనా ఖర్చు కంటే అయిదు రెట్ల ఖర్చు అనేది పాన్ ఇండియా మూవీకు అవుతుంది.
అయితే పాత తరం హీరోల్లో ఎన్టీఆర్,ఏయన్నార్, కృష్ణ.. లాంటి వారు సంవత్సరానికి దాదాపు నాలుగు నుండి అయిదు సినిమాలు చేసేవారు అందుకే వారు చేసిన సినిమాల్లో ఎక్కువశాతం హిట్ గా నిల్చేవి. అప్పట్లో ఖర్చు కూడా తక్కువే ఉండేది. దాని వల్ల ఏదైనా ఒక సినిమా ప్లాప్ ఐనా నిర్మాతకు పెద్ద ఇబ్బంది ఉండేది కాదు.. ఒక వేళ ఏదయినా అలాంటి కండిషన్ వచ్చినపుడు సూపర్ స్టార్ కృష్ణ లాంటి హీరో తన రెమ్యూనరేషన్ తగ్గించుకునే వారు కూడా ఆయా సందర్భాల్లో నిర్మాతలు అనేవాళ్ళు.అయితే ప్రస్తుత తరం హీరోల్లో అలాంటి మనస్తత్వం అనేది కనబడుట లేదు. వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేయడం అది హిట్ అయితే పర్లేదు కానీ తేడా కొడితే మాత్రం నిర్మాతలుకు దాని నుండి కొలకోవడం కష్టం.