పాన్ ఇండియా పేరుతో నిర్మాతలను దర్శకులు ముంచుతున్నారా ?
* కథలో బలం లేకుండా పాన్ ఇండియా అంటూ బిల్డప్
* టాలీవుడ్ కొంపముంచుతున్న పార్ట్ 1, పార్ట్ 2
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియాలో ట్రెండు కొనసాగుతోంది. చిన్న దర్శకుడిని కదిలించిన కూడా పాన్ ఇండియా ఆ రేంజ్ లో సినిమా తీస్తానని చెబుతున్నారు. అసలు పాన్ ఇండియా మీనింగ్ తెలియని దర్శకులు కూడా... రెచ్చిపోయి సినిమాలు తీస్తున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత.. బొక్క బోర్లా పడుతున్నారు. వాళ్లు పడడమే కాకుండా నిర్మాతలను కూడా ముంచేస్తున్నారు దర్శకులు.
లేటెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం దాదాపు జూనియర్ ఎన్టీఆర్ రెండు సంవత్సరాలు కష్టపడ్డాడని చెప్పవచ్చు.అంతలా కష్టపడి జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేస్తే... రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ టాక్ వస్తుంది. అంతేకాదు పార్ట్ వన్ అలాగే పార్ట్ 2 అంటూ ఈ సినిమాకు కలరింగ్ ఇచ్చారు దర్శకుడు కొరటాల శివ. ఒక్క పార్ట్ లో చెప్పేది.. రెండు భాగాలుగా విడగొట్టి టైం వేస్ట్ చేస్తున్నారు.
కథలో దమ్ము లేకున్నా... కొంతమంది దర్శకులు... నిర్మాతలను మోసం చేస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. ఏదో చిన్న చిన్న కబుర్లు చెప్పి నిర్మాతలను బోల్తా కొట్టిస్తున్నారట. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. రెగ్యులర్ స్టోరీ ని తీసుకొని.. పెద్ద స్టార్ హీరో తో సినిమా చేసేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. అలా చేసిన.. సినిమాలు చాలావరకు అట్టర్ ఫ్లవర్ అవుతున్నాయి.
ప్రాణం పెట్టి ఏ దర్శకుడు సినిమా తీయడం లేదు. ఏదో రెగ్యులర్ స్టోరీ అలాగే ఫైట్స్, రొమాంటిక్ సీన్స్ పెట్టి ఏదో సీరియల్స్ ఎలాగా ఈ పార్ట్ వన్ అలాగే పార్ట్ 2 లు తీస్తున్నారు. ఇలా దర్శకులు చేయడం వల్ల నిర్మాతలు నష్టపోవడమే కాకుండా... స్టార్ హీరోల క్రేజ్ కూడా తగ్గిపోతుంది.బాహుబలి తర్వాత ప్రభాస్ పరిస్థితి అచ్చం అలాగే తయారైంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి అలాగే ఉందని కొంతమంది చెబుతున్నారు.