దేవర: ఎన్టీఆర్ ఊచకోత..రాడ్ దింపేలా ఫస్ట్ డే కలెక్షన్స్..!

Divya
ఎన్టీఆర్ దేవర సినిమా నిన్నటి రోజున భారి స్థాయిలో రిలీజ్ అయ్యి  అభిమానులను బాగా ఆకట్టుకుంది. మొదటిరోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లు వసూలు చేసిందని విషయం పైన ఇప్పుడు ఇండస్ట్రీలో దేవర సినిమా గురించి హాట్ టాపిక్ గా మారుతోంది. ఎన్టీఆర్ మొట్టమొదటి పాన్ ఇండియా కావడం చేత అలాగే ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల శివ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం , జాన్వీ కపూర్ మొదటిసారి తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. సైఫ్ అలీఖాన్ కూడా మొట్టమొదటిసారిగా విలన్ గా నటించారు. ఇలా అన్ని కూడా దేవర సినిమా పైన భారీ బజ్ ను ఏర్పడేలా చేశాయి.

ఇప్పుడు తాజాగా దేవర సినిమా పైన నెగటివ్ కావాలని చేసిన వారందరికీ రాడ్ దింపేయాలా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.. సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా మొదటి రోజు రూ .140 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లుగా తెలియజేస్తున్నారు.. రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారుగా 60 నుంచి 70 కోట్లు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. బాలీవుడ్ లో 7 కోట్ల రూపాయలు మిగతా భాషలలో పాటుగా ఓవర్సీస్ లో కలుపుకొని సుమారుగా 140 కోట్ల రూపాయలు వచ్చాయని అంచనా వేస్తున్నారు.

దేవర సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్పై ఇంకా అధికారికంగా మేకర్స్ ప్రకటించాల్సి ఉన్నది.. ఈ విషయం తెలిసిన అభిమానులకు సైతం తెగ ఆనందపడుతూ కావాలని నెగిటివ్ టాక్ చేసిన వారందరికీ ఇదే మా సమాధానం అంటూ తెలియజేస్తున్నారు. దేవర సినిమాలో ఎన్టీఆర్ మాస్ స్టైల్ లో కనిపించడమే కాకుండా ఊచకోత కోశారనే విధంగా వినిపిస్తోంది. మరి ఏ మేరకు అసలు సత్తా అంత ఈ రెండు మూడు రోజులలోనే చూపించాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ అభిమానులనుకున్నట్టుగానే 500 కోట్ల క్లబ్ లోకి చేరుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: