విజయ్ దేవరకొండ కన్ఫ్యూజన్ !
వాస్తవానికి ఈమూవీని వచ్చే సంవత్సరం ఉగాది రోజున మార్చి 28న విడుదల చేయాలని భావించి చాల ముందుగానే ఈమూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు అదే డేట్ కు పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ విడుదల అవుతున్నట్లు ప్రకటన రావడంతో విజయ్ దేవరకొండ అదేవిధంగా గౌతమ్ తిన్న నూరి ఊహించని షాక్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
పవన్ రాజకీయంగా ఇప్పుడు కీలక అధికారంలో కొనసాగుతున్న పరిస్థితులలో పవన్ నుండి సినిమా వస్తోంది అంటే అతడి అభిమానులకు సంక్రాంతి పండుగను మించి ఉంటుంది. దీనితో విజయ్ దేవరకొండ సినిమాను ఏప్రియల్ కు వాయిదా వేయవలసిన పరిస్థితి. అయితే ఏప్రియల్ 10న ప్రభాస్ మారుతిల ‘రాజా సాబ్’ తన విడుదల డేట్ ను ఫిక్స్ చేసుకోవడంతో విజయ్ కు తన సినిమాను ఏప్రియల్ నెలాఖరుకు విడుదల చేయవలసిన పరిస్థితి.
అయితే ఈసారి సమ్మర్ రేస్ కు చాల భారీ సినిమాలు ఏప్రియల్ మే నెలలల్లో విడుదల అవుతున్న పరిస్థితులలో విజయ్ గౌతమ్ తిన్న నూరి ల మూవీ ప్రాజెక్ట్ కు సరైన డేట్ దొరకడం రాబోతున్న సమ్మర్ లో కొంచం కష్టం అనే మాటలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం మిస్ చేసుకున్న గౌతమ్ తిన్న నూరి కి విజయ్ తో చేస్తున్న ప్రాజెక్ట్ చాల కీలకంగా మారింది. దీనికితోడు టాప్ హీరోల రేంజ్ కి ఎడగాలి అని ప్రయత్నాలు చేస్తున్న విజయ్ దేవరకొండకు ఒక సరైన బ్లాక్ బష్టర్ హిట్ కావాలి..