యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర మొదటి భాగం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ బృందం మొదటి నుండి కూడా హిందీ ఆడియన్స్ ను ప్రధాన టార్గెట్ గా చేసుకుంది. అందుకు అనుగుణంగా హిందీ లో అనేక ప్రచారాలను కూడా ఈ మూవీ యూనిట్ చేసింది. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ హిందీ ఆడియన్స్ పై ప్రత్యేక దృష్టిని పెట్టాడు. అందులో భాగంగా అనేక ఇంటర్వ్యూలను కూడా హిందీ లో నిర్వహించాడు.
దానితో హిందీ ప్రేక్షకులు మొదటి నుండి ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి మంచి అంచనాల నడుమ హిందీ లో విడుదల అయిన ఈ సినిమాకు అక్కడ ప్రేక్షకుల నుండి మంచి టాక్ లభిస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లను చాలా బాగా ఇష్టపడుతున్నారు. అలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబడుతున్నాయి.
ఇక ఈ సినిమా కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కావడంతో హిందీ ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ కి హిందీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఏర్పడింది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే ఆయనకు హిందీ లో మరింత మార్కెట్ పెరిగే అవకాశం చా వరకు ఉంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హిందీ మూవీ అయినటువంటి వార్ 2 లో హీరోగా నటిస్తున్నాడు.