టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలకు కథ రచయితగా పని చేసి ఆ తర్వాత దర్శకుడిగా కెరియర్ను మొదలుపెట్టాడు. అందులో భాగంగా మిర్చి మూవీతో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించిన ఈయన మొదటి మూవీ తోనే సూపర్ కమర్షియల్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా ఈయన దర్శకత్వంలో రూపొందిన శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను సినిమాలు కూడా మంచి విజయాలను అందుకోవడంతో ఈయన టాలీవుడ్ లో టాప్ దర్శకుల సరసన చేరిపోయాడు.
అలా అద్భుతమైన స్థాయిలో కెరీర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈయన ఆచార్య మూవీ కి దర్శకత్వ వహించాడు. ఈ మూవీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ అపజయంతో ఈయన కెరియర్ గ్రాఫ్ కాస్త పడిపోయింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా దేవర పార్ట్ 1 మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదల అయింది. ఇక ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తుంది. కొంత మంది మాత్రం ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించడం కోసం సెకండాఫ్ లో కాస్త స్టోరీని లాగారు.
అలా లాగకుండా కేవలం ఒకే భాగంలో ఈ సినిమాను చూపించాలి అనే ఉద్దేశంతో ఈ మూవీ ని రూపొందించి ఉంటే ఈ సినిమా కథ అదిరిపోయే రేంజ్ లో ఉండేది. కచ్చితంగా దీనికి బ్లాక్ బస్టర్ టాక్ కూడా అన్ని ప్రాంతాల నుండి వచ్చేది అని కొంత మంది ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ తో ఈ సినిమా భారీ మొత్తంలో కలక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.