వారికి న్యాయం చేసేందుకు ఎన్టీఆర్ కష్టం ఫలించిందా..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ రోజు అనగా సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయింది. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లు అర్థరాత్రి నుండే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించబడ్డాయి. ఇకపోతే చాలా మంది అభిమానులు , సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు సంబంధించిన అర్థరాత్రి షో లను వీక్షించారు. దానితో అప్పటి నుండే ఈ సినిమాకి సంబంధించిన విశ్లేషణలు మొదలు అయ్యాయి.

కొంత మంది సినిమా బాగుంది. కొరటాల శివ "ఆచార్య" తర్వాత తన పూర్తి స్ట్రెంత్ ఉపయోగించి ఈ సినిమా చేశాడు అని చెబుతూ ఉంటే మరి కొంత మంది మాత్రం ఈ సినిమా కూడా మరో ఆచార్య లాగానే ఉంది అంటున్నారు. ఇక మరి కొంత మంది అయితే సినిమాలో ఎన్టీఆర్ తన యాక్టింగ్ తో అదరగొట్టాడు అని , కథ పెద్ద గొప్పగా ఏమి లేకపోయిన ఎన్టీఆర్ కోసం తన అభిమానులు ఈ సినిమా చూడచ్చు అని అంటున్నారు.

ఇక మరి కొంత మంది ఎన్టీఆర్ కోసం మాత్రమే ఈ సినిమా చూడవచ్చు. పెద్ద గొప్ప కథ కాకపోయిన ఎన్టీఆర్ మాత్రం తన అద్భుతమైన నటనతో ఈ సినిమాను ముందుకు నడిపించాడని , ఎన్టీఆర్ ఈ మూవీ కి పెద్ద పిల్లర్ గా నిలిచాడు అని చెబుతున్నారు. ఇలా ఈ సినిమాకు అనేక మంది జనాల నుండి అనేక రకాలైన టాక్ స్ప్రెడ్ అవుతుంది. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి టాక్ తో ముందుకు వెళుతుందా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: