కొర‌టాల క‌థ‌ను డామినేట్ చేసిన ఎన్టీఆర్ యాక్టింగ్‌.. అదే సినిమాకు మైన‌స్‌..?

Divya
మిర్చి', 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను', 'జనతా గ్యారేజ్'... కొరటాల శివ సూపర్ హిట్ సినిమాల్లో కథానాయకుడికి ఓ ఐడియాలజీ ఉంటుంది. దాంతో కనెక్ట్ చేస్తూ సన్నివేశాలు, వాటి నుంచి యాక్షన్ సీక్వెన్స్ లు రాసుకోవడం వల్ల హీరోయిజం ఎలివేట్ అయ్యేది. కథపై ప్రేక్షకుడిలోనూ ఆసక్తి కలిగేది. 'దేవర'లోనూ హీరోకి ఓ ఐడియాలజీ ఉంది. అయితే, అందులో కొత్తదనం లేదు. ఆయన హిట్ సినిమాల్లో ఉన్న ప్రత్యేకత కనిపించలేదు. అన్నిటికీ మించి ఐడియాలజీని హీరోయిజం డామినేట్ చేసింది. దాంతో స్క్రీన్ ప్లే గానీ, క్యారక్టరైజేషన్లను గానీ ఊహించడం ప్రేక్షకుడికి కష్టం కాదు. ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టు కథ, కథనాలు ఉన్నప్పుడు స్క్రీన్ మీద సన్నివేశాలు ఎంగేజ్ చేసేలా ఉండాలి.
అక్కడ కొన్ని చోట్ల కొరటాల మార్క్ మిస్ అయ్యింది. జాన్వీ కపూర్ సీన్లు, ఆ డైలాగులు, క్లైమాక్స్ ట్విస్ట్ విషయంలో కొరటాల చాలా డిజప్పాయింట్ చేశారు. ఎండింగ్ ట్విస్ట్ అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను గుర్తుకు తెస్తుంది. ఫస్టాఫ్ యాక్షన్, ఎన్టీఆర్ హీరోయిజంతో ముందుగు సాగింది. సెకండాఫ్‌లో కాస్త నిడివి ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ లేకపోతే సినిమా లేదు అన్నట్టుగా చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే కొరటాల శివ ఇంకా ఆచార్య నుంచి బయటపడలేదేమో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్లు చేస్తున్న ఆడియన్స్ కి మాత్రం ఆ రేంజ్ లో ఈ సినిమా మెప్పించలేదని వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం.
నిజానికి సోలో హీరోగా ఆరు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ ముందుకు వచ్చారు. దీంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా పీక్స్ కి వెళ్ళిపోయాయి. కానీ కొరటాల శివ మాత్రం ప్రజెంటేషన్ విషయంలో కాస్త వెనకడుగు వేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ కథ ను డామినేట్ చేసింది మాత్రం ఎన్టీఆర్ నటన అని చెప్పవచ్చు.మొత్తానికైతే ఐడియాలజీ మిస్ అవ్వడమే సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: