యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర మొదటి భాగం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా విడుదల అయ్యి ఆరు సంవత్సరాలు కావడం , అలాగే ఆర్ ఆర్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన మూవీ కావడంతో మొదటి నుండి ఈ సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఇక భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదల అయింది.
ఇకపోతే భారీ అంచనాలు ఉన్న సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో ఉత్సాహం కూడా అదే స్థాయిలో ఉంది. ఆ ఉత్సాహం కాస్త అది కావడంతో కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా నడుస్తున్న థియేటర్ దగ్గర చెదురు మొడురు సంఘటనలు నెలకొంటున్నాయి. తాజాగా కడప లో ఒక సంఘటన నెలకొంది. అసలు విషయం లోకి వెళితే ... కడప లోని రాజా ధియేటర్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా విడుదల చేశారు. దేవర రిలీజ్ షో సందర్భంగా చాలా మంది అభిమానులు ఈ థియేటర్ దగ్గరికి వచ్చారు. కొంత మంది టికెట్ లేకపోయినా థియేటర్ లోపలికి దూసుకు వెళ్లారు. వారిని ఆపే క్రమంలో ఫ్యాన్స్ మరియు థియేటర్ సిబ్బందికి మధ్య వాగ్వాదం నెలకొంది.
ఈ వాగ్వాదం కాస్త తీవ్ర స్థాయికి చేరుకోవడంతో థియేటర్ దగ్గర ఉధృత చోటు చేసుకుంది. కొంత మంది అభిమానులు సిబ్బందిని చితక బాదారు. దీంతో నిర్వాహకులు షో ను నిలిపివేశారు. ఇలా కడపలోని రాజా థియేటర్ దగ్గర చిన్న ఉద్రిక్తత సంఘటన నెలకొంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.